Friday, February 5, 2016

భ్రమర కవనాలు 2 (సంఖ్య 51నుండి)

                      భ్రమర కవనాలు 51 నుండి

పేరు  : గంజాం. భ్రమరాంబ
ఊరు : తిరుపతి

కవిత సంఖ్య :   51

తేదీ : 26-01-2016

************************

త్రివర్ణ పతాకపురెపరెపలు
-------------------------------------

పేద..ధనికుల ...మధ్య ..
తగ్గుతున్న...అంతరం

ఆడ...మగల...మధ్య ..
పెరుగుతున్న ..సహకారం

కులాల కు ...అతీతంగా..జరిగే
లౌకిక వాద ఎన్నికలు

ప్రజల ...భాగస్వామ్యం తో
వెల్లివిరిసే ...ప్రజాస్వామ్యం


సామాన్యుల  ఓటుహక్కు కున్న...
ఎనలేని ..ప్రాధాన్యం ...

చట్టం ...ముందు ...అందరూ
సమానులన్న...వాస్తవం

ఉజ్వల.....భారతదేశ
చిన్నారులు..చక్కగా ..విన్నారు

రాజ్యాంగ నిర్మాతలకు
జేజేలు....పలికారు

గొప్ప వారి...త్యాగాలను
ముక్తకంఠంతో ..పొగిడారు


నేటి ..లేతమనసు..బాలలనూ

రేపటి ...బాధ్యత గల..పౌరులనూ

సంతృప్తి గా వీక్షిస్తూ...

వారిపైన ...ఎనలేని ..
అభిమానం..ఒలికిస్తూ ..


అగ్రరాజ్యాల ...సరసన
సముచిత ..స్థానం ..కై..

శాస్త్ర ...సాంకేతిక ..రంగాల
అభివృద్ధి ని...సాధిస్తూ ..

కొత్త ఆశలతో ..

సరికొత్త ..ఆకాంక్షలతో..

ఎగురుతున్నది...


మన..సగర్వ..మువ్వన్నెల..పతాకం


"త్రివర్ణ పతాక రెపరెపలు"

భారతదేశ ప్రగతికి ప్రతీకలు..

జయహో...జవాన్

జయహో...కిసాన్

జయహో...భారత్


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి


అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   52

తేదీ : 26-01-2016

************************

             తదితరులు
     ----------------------------
జండా పండుగ నాడు
పాఠశాలకు  పెద్ద పెద్దవాళ్ళు
వస్తున్నార న్న...కబురు

గుండెల్లో ...గుబులుపుట్టించగా...

వారం ..రోజుల ముందునుంచే
బడి...అంతా...హుషారుగా
శుభ్రంగా ...తయ్యరయ్యింది


పెద్ద..పెద్దవాళ్ళు ...

సమయానికి వచ్చి...

జెండాను..ఎగురవేసి...

ఫోటోలకు..ఫోజులిచ్చి..

జేజేలు ...స్వీకరించి..

అభయాలు...ప్రసాదించి..

నిమిషాల కే...అలిసిపోయి ...

క్షణాల్లో ...తుర్ర్..మంటే..

వారి...భజనగణం..పేల్చి న..టపాసులు...

అవి..మిగిల్చిన..చెత్తచెదారాలు..

ఊడ్చిన...చేతులు
ఊడ్పించిన...గొంతులు

అలసట తో కూలబడితే

పిల్లల ఉత్సాహం ...
ఉపాధ్యాయుల..ప్రోత్సాహం ..

బడలికతో.. .సోలిపోతే..

కార్యక్రమ వివరాల లో
పతాక శీర్షికల ను ...
పెద్ద ...పెద్ద..వాళ్ళు ...
ఆక్రమించగా....


కార్యక్రమ నిర్వహణ కు
రేయింబవళ్ళూ...కృషి చేసి..
అలసి పోయిన...
సిబ్బంది...
పిల్లలు ...
వార్తావిలేఖరులు..
అమాయక ప్రజానీకం..

" తదితరులు  "...గా

గుర్తిపబడ్డారు...


శ్రమించడానికి...వెనుకాడనీ..
గుర్తింపు కు...నోచుకోని ...

ఇలాంటి .." తదితరులు  "

గ్రామాలలో..
పట్టణాలలో...
రాష్ట్రాలలో ..
దేశాలలో ...
ఎందరో ...ఎందరెందరో ...

ఎందరో...మహానుభావులు..

అందరికీ ..వందనాలు

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   53

తేదీ : 27-01-2016

************************
     
       ఆనందోబ్రహ్మ
    ----------------------------

ప్రతివారూ ..కావాలీ.అని..కోరుకునే...

ఏ..ఒక్కరూ...వద్దు...అని ...చెప్పలేని..

 నిజమైన..   ఆనందానికి ..  మూలం ..

ఏమిటా...అని..ఎన్నో...చోట్ల ..

ఎన్నో రకాలుగా .....వెతికి చూసాను

చాలా...చోట్ల...దొరికింది ..కూడా..

మనకు ఇష్టమైన వారి..సమక్షంలో ...

మనకు...నచ్చిన...పనిలో ...

మనకు..ప్రేరణ ..నిచ్చే ..పుస్తకంలో..

భగవంతుని.. సన్నిధి లో ..

అలా ...చాలా ...చోట్ల..దొరికింది ..


కానీ...ఆ...సుదూర..ప్రయాణం ..

ఒక...విషయం ...స్పష్టంగా ..తెలిపింది

ఆనందం ..అనేది...ఎక్కడో
వెతికితే ..దొరికే ..వస్తువు..కాదనీ


ఎవరికి..వారే ..సృష్టించు కోవాలి ..అనీ..

మనిషికి ...పరీక్షలు ..పెట్టి ..
ఆనందించే ... తెలివైన ..దేవుడు...

లంకె బిందెలలో ..నగలను ..దాచినట్టుగా

వారి...వారి...మనస్సులో ..నే..

ఆనంద..నిధులను..దాచిపెట్టాడు

అంతర్ముఖంగా ...వెళ్ళి ...వెతికే ..

దొరికినోళ్లకు...దొరికినంత....

తెలుసుకున్న వాళ్ళకు ..తెలుసుకున్నంత
 
  అనంతం ...అపూర్వం... అపురూపం..

      "ఆనందోబ్రహ్మ .."

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   54

తేదీ : 27-01-2016

************************

    కాస్త ...ఆలోచించండి
--------------------------------------


తల్లిదండ్రుల ఆప్యాయతలు

అక్కా తమ్ముళ్ళ అనురాగాలు

అవ్వా తాతల మురిపాలు

స్నేహితుల తో ఆటపాటలు

ఇవేవీ ...లేకుండా

మార్కులే...ధ్యేయం గా

పోటీ పరీక్షలే...పరమావధిగా

హాస్టల్లో ....తొక్కిపెట్టి

వారి...మనస్సుల్ని..నొక్కి పట్టి...


సిలబస్‌ ను బాగా రుబ్బించి

లీటర్ల కొద్దీ...త్రాగించి

గాలన్ల కొద్దీ..కక్కిస్తుంటే

ఊపిరాడని ...పిల్లలు


అయితే ..గియితే

మంచి...ఆఫీసర్లు ...

పెద్ద..కోటీశ్వరులూ...

అవుతారేమో ...గానీ

మంచి...మనుష్యులు

ఎలా...అవగలరూ...

మనస్సు న్న...పెద్దలారా...

" కాస్త ..ఆలోచించండి "

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   55

తేదీ : 28-01-2016

************************

అభిలషనీయమైన...మార్పు
-------------------------------------------------

సమాజం ..ముందు కొచ్చి

నిలుచున్న ...ప్రతి మార్పు ..

తనతో పాటు ...

ఎగతాళి ...ని

విమర్శల...ని

హేళనల...ని

ఛీత్కారాల...ని

శల్యపరిశోధన ల...ని

వ్యతిరేకతల...ని


వెంట...తీసుకొని ..వస్తుంది.

ఈ...అలజడులు ...అన్నింటినీ ..

దీటుగా ....ఎదుర్కోలేని

 చిన్న చిన్న  మార్పులు

కాలప్రవాహంలో...

కొట్టుకొని ...పోతాయి


ఏ...మార్పులు ...అయితే

ఎటువంటి ...ఎదురు దెబ్బలను

సైతం ...తట్టుకొని...ఠీవిగా...

నిలదొక్కు కుంటుందో...

చరిత్రలో ..అది..శాశ్వతంగా ..

మిగిలిపోతుంది ...


అదే ..." అభిలషనీయమైన..మార్పు "

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   56

తేదీ : 28-01-2016

************************

        త్యాగరాజస్వామి
---------------------------------------

తెలుగువారి ...మనస్సు లోగిళ్ళ లో ..

 శాస్త్రీయ సంగీత  ..ఆనవాళ్ళలో..

కదలాడే వారు.. ఎవరు వారు..


సరి...గరిమ...గల స్వరరాజు...వారు

సరిగమల... శ్రీ ...త్యాగరాజు వారు

వందల సంవత్సరాలు గా

శిష్య...పరంపర ను...

కొనసాగిస్తున్న గురురాజు వారు

ఎంతో ...పేదరికం లో ..మగ్గినా...

రామ...నామమే...తన..సంపదగా....

భావించి ...రచించి...సంకీర్తించిన

వాగ్గేయకారులు..వారు ..

.....

నిధి...చాలా ...సుఖమా

రాముని ..సన్నిధి ..సేవ...సుఖమా


.......
జగమే లే...పరమాత్మ ...

ఎవరితో ...మొరలిడుదూ...

....
గగనానికి...ఇలకూ...

బహుదూరంబనినాడో

......
మరుగేలరా ...
ఓ...రాఘవా...

....

అన్నీ..నీవనుచూ..అంతరంగమునా..

తిన్నగా ..వెతకి...తెలిసికొంటినయ్యా..

....
రోమాంచమనే...ఘన..కంచుకము

రామ భక్తుడ నే...ముద్రబిళ్ళయూ...

రామనామమనే...వరఖడ్గమిది...

......

బంటు రీతి కొలువు...

ఇయ్యవయ్య...రామా...

.....


మనసులో ని మర్మమునూ..
తెలుసుకో...

.......
కనికరమ్ముతో...ఈవేళ ...
నాకరము...బట్టు ...

అంటూ

ఎన్నో...సంకీర్తనల...మహత్యాన్ని..

రుచి..చూపిన...మహనీయు డు

శాస్త్రీయ సంగీత ఆరాధన లో ...

ఎందరికో ...ఆదర్శ ప్రాయుడు..

ఎన్నిసార్లు ...అన్నా...

మరెన్నో సార్లు ..విన్నా...

మాధుర్య మే...వినిపించే

మహదానందమే...కలిగించే ...

ఆ..  నాదబ్రహ్మ...స్వరాలకు

భక్తితో ... నమస్కారాలు


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   57

తేదీ : 29-01-2016

************************


            వైరం
       -------------------
ప్రపంచం ... నిదురించాక..

లేత..చిరుగాలి...తాకినట్లు...

నీ...జ్ఞాపకం ...నిద్దురలేస్తుంది

నీ...జ్ఞాపకం ...నిద్రలేచాక..

తెలిమంచు...కరిగినట్లు...

ప్రపంచం ..మాయమవుతుంది

ప్రపంచానికీ....

నీ...జ్ఞాపకానీకి ...మధ్య ..

" వైరం" ఎందుకో ....



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   58

తేదీ : 29-01-2016

************************

          అంతరాత్మ
       ----------------------

ఒక...మంచిపని చేసినపుడు

అభినందిస్తూ ...

ఒక...పొరపాటు ...చేయక ముందే ...

హెచ్చరిస్తూ ...

మనం..చేసిన...ప్రతీ పనినీ ..

సమీక్షిస్తూ ....

భగవంతుని ..మారురూపుగా..వెలిగే

     " అంతరాత్మ" ....కు

        నమోనమామి


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   59

తేదీ : 29-01-2016

************************


   అనురాగాల...కో వెళ్ళు
---------------------------------------
ఆడవారి..పుట్టిళ్ళు...

అనురాగాల...కో వెళ్ళు...


పసిపాపగా...పారాడి..

బుజ్జాయిగా..జోగాడి..

బడుద్దాయిగా...బడికెళ్ళి..

కేరింతలు గా...కళా శాలకెళ్ళి..

మంచి ..ఉద్యోగం ..సాధించి..

పరువానికి..ఎదురెళ్ళి..

కుమారి...శ్రీమతిగా...మారి..

పాత ...ఇంటిపేరు తో ..పాటు..

పుట్టిల్లును...వదిలేసి ..

కొత్త ...కొత్త ...ఆశలతో ..

సరికొత్త ..ఊసులతో..


కొంగ్రొత్త ..ఇంటిపేరు ను..

ప్రేమ గా...  తగిలించుకుని ...

పయనించే..మన...బంగారుతల్లులు...

తమ..పెళ్ళయిన ..కొత్తల్లో ...

పుట్టింటి..వారు..గుర్తుకొస్తే..చాలు


ఫోన్లు చేసి..గంటలు ..గంటలు ..

కబురులే...చెపుతారు.

తరచి...తరచి..

పుట్టింటి..ఊసులే..అడుగుతారు

దిగులెక్కువయితే...వారినే...

పరుగెత్తి ..రమ్మంటారు...


మరి...ఇన్నాళ్ళూ...తిరగాడిన..

 తమ...తమ..   పుట్టిళ్ళే...గుర్తొస్తే..

ఏమీ.. తోచక ...

బిక్క మొఖం..వేస్తారు

బెంగతో..లంఖణాలు..చేస్తారు ..

పండుగలు..ఎప్పుడొస్తాయా...అని

తెగ...ఎదురుచూస్తారు.

కాకితో.. పంపినా..కబురందగానే..

శ్రీ వారి..చెయ్యందుకొని..

చెంగున .. పుట్టింటి లో..వాలిపోతారు

పుట్టిల్లంతా...పదిసార్లు ..

తిరిగి... తిరిగి ...చూస్తారు

ఇష్టమైన..వంటలు

కొసరి ..కొసరి..తింటారు

చిన్నప్పటి ..జ్ఞాపకాలలో

అలసి..పులిసి..పోతారు

ఎందుకో...తెలుసా...

ఆడవారి..పుట్టిళ్ళు...

" అనురాగాల...కో వెళ్ళు.."


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   60

తేదీ : 30-01-2016

************************

        నవరసాలు
    ------------------------

మనిషి జీవితం లో నే  కాదు...
బాగా...గమనిస్తే ....
ప్రకృతి లో నూ..నవరసాలు..
అంతర్లీనంగా..అమరి...ఉన్నాయి...


ఋతువుల...పలకరింతకు...
పులకరించి..కనికరించి...
విరబూసే... మొగ్గలూ..  పూలు...
విరగగాసే...కాయలూ...పండ్లు ...
వానలు..వెన్నెలలూ..చల్లనిగాలులూ..

కరుణ ...రసానికి ..ప్రతీకలు

అతినీలలోహిత ..కిరణాలు
ఓజోన్ ...పొరను...దెబ్బతీస్తుంటే..
దానికి...కారణమవుతున్న
మానవాళి ని...ఇంకేమీ ...
చెయ్యాలో ...అర్థం ..కాక.
చండప్రచండంగా...ఎండచూపుతున్న...
సూర్యుని ...ప్రతాపాలు ..

 రౌద్ర ..రసానికి ..ప్రతీకలు

ప్రత్యూష పవన..వీచికల..సందడికి
నిదురలేచిన...కుసుమాల..
చిరుదరహాసాలు...
శుకపికాది...కిలకిలా ..రావాలు...
తూనీగల..తుళ్ళింతలూ..

హాస్య ..రసానికి ..ప్రతీకలు

వేళకాని..వేళ లలో ..
ఉరుముల తో...మెరుపులతో ..
కుంభవృష్టి ...కురిపించే...
ఒళ్ళు ...ఝల్లు మనిపించే..
కారుమబ్బులకు...హెచ్చరికగా
ఎగసి....రోష...పడుతున్న..
సముద్రం...లోని...కెరటాలు ...

వీర...రసానికి...ప్రతీకలు


ఎన్నోరకాల ...కాలుష్యా లతో ....
మరెన్నో ...రకాల...విధ్వంసాలతో..
అతలాకుతలం అవుతున్న...
మన...ధరిత్రి...ఆస్తులూ
రేపటి తరానికి..అందించే..అవస్థ లూ...

భయానక ...రసానికి ..ప్రతీకలు

ధరతక్కువనే...కారణం తో ..
చిన్న...నుంచీ ..పెద్ద..వరకూ..
అవసరాల..కన్నా...అధికం గా...వాడుతున్న...
ప్రత్యామ్నాయం...తక్కువ గా ...ఉన్న...
ప్లాస్టిక్ ...వాడకాలు...
అది...సృష్టి స్తున్న...అవశేషాలు ..

బీభత్స ...రసానికి ...ప్రతీకలు

దైనందిన ..జీవిత ..ప్రయాణం ..లో
అలిసిపోయి న...హృదయాలు..
సేదతీరడానికి....అరకూ ..
ఊటీ...కొడైకెనాల్...విహారాల్కు..వెళితే ..
ఆహ్వానించే...అందమైన ..మైదానాలు...
కను విందు...చేసే ...
చక్కటి...ఉద్యానవనాలు..
ఆ...ఆనందానికి ...
కాలాలు..ఆగే..క్షణాలు ..

అద్భుత ...రసానికి ...ప్రతీకలు

చల్లని...వెన్నెలరాత్రులూ...
సన్నగా...పారే...సెలయేరులూ...
చిన్నగా...కురిసే ...మంచు..ముత్యాలు ..
మెల్లిగా ...తలలూపే..వరికంకులూ..

శాంత...రసానికి ...ప్రతీకలు


కొండల...చాటుకు...వెళ్ళి..
సాయం సంధ్యను...ముద్దాడినప్పుడు...
కళ్లా ర్పకుండా...చూసిన..
 నీలాకాశపు..బుగ్గల..లోని..
లేత...ఎరుపురంగులు..
అవి..చూపుతున్న..కొంటెతనపు..దారులు

శృంగార ...రసానికి ..ప్రతీకలు

"నవరసాలు"..ప్రజ్వరిల్లి తే..
నీరసాలు...ఆవిరైపోవాల్సిందే.. సుమా..



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   61

తేదీ : 31-01-2016

************************

            జీవిత సత్యం
         ------------------------  
మన..చిన్ని ...జీవితం ..లో ..
తన..నిరంతర ..ప్రవాహంలో ..

కాసేపు ....భుజం తడుతూ..

మరికాసేపు ...సహనాన్ని
పరీక్షించి ...

కన్నింటికీ ...చిరునవ్వు లకీ...మధ్య

ఊయలలూగుతూ...

అడిగింది ...ఇవ్వకుండా..ఏడిపిస్తూ ...

అంతకన్నా ...మంచిదే ...
అందిస్తూ ...

మనకు..రావాలసింది..
ఎప్పటికైనా ...
ఎన్నటికైనా...
మనకు...చేరుతుంది..

అనే ..నమ్మకాలు ..పెంచుతూ..

పని...చేయడం ..నీవంతు..

ఆనందం ..అందించడం ..
నావంతు...

అని...తేల్చిచెప్పే...

శ్రమైకజీవనమే...నిరంతర..
బ్రహ్మానందం ..మహదానందం..

అని...తెలియజెప్పే ...


గొప్ప .. " జీవిత సత్యం "....

అవగతమై తే..నిత్యం ..వసంతం.


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి


అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   62

తేదీ : 31-01-2016

************************

    పొరుగువారు
-------------------------
మతగ్రంధాల...సారాంశాన్ని ..
తెగరుబ్బి...త్రాగామనీ...
పెద్దల...అనుభవాల...సారాన్ని ...

పరిశోధన లే..చేసామని...

విర్రవీగు..కొందరు..వెర్రివారు..

మేధావుల మౌనాన్ని..
అలుసుగా...తీసుకుని..

తమలోని ...అక్కసును..
కవితలా...మలచుకొని...

అసలువిషయం ..మరిచారు..

పొరుగువారిని..ప్రేమించడం ..

ఇతరుల తప్పులు ...తమతప్పులుగా...

భావించి ..మన్నించడం...

ఎదుటివారి..లోని ..మంచిచెడ్డలు ..
ఉన్నదున్నట్లుగా ...స్వీకరించడమే

వారికిచ్చే ..నిజమైన ..గౌరవం ..

అని...మరచిపోయి ..విస్మరించి ..
 కొందరు...వెదుకుతున్నారు...

తెల్లవార్లూ ...పాపం ..

మనకన్నా..ఎక్కువ ..లోపాలు గల

" పొరుగు వారు "..

ఎక్కడుంటారో...చూడాలనీ..

వారి..మనసాక్షి...తిరగబడింది ..

నీ..స్థాయి..ముందు..తేల్చుకోమనీ...

ఒప్పులను ..చాటింపువేసి...
బహిరంగంగా ..చెప్పినా..

తప్పులను..మాత్రం...
 సున్నితంగా ..నే..చెప్పాలి

ఒక్కవేలు..ఎక్కుపెట్టి..చూపిస్తే ..
మూడువేళ్ళు..ఎదురొస్త్తయి..కదా..

అన్నీ..తెలుసు ..అనే..
అహంకారం ..వీడితే...

చిన్న..చిన్న ...తప్పులకు..
మనస్పూర్తిగా ..నవ్వేస్తే..

అప్పుడే .చూడగలం...
 మనసులో పరిమళించే..
 సంస్కార ...దర్శనం ..

అప్పుడే ...చూపగలం...
నిజమైన సంస్కరణ కు..
దారి..చూపే..నిదర్శనం

నిర్దయ..హృదయాలని..

జాలితోనే...కరిగించాలి
ప్రేమతోనే ...కలుపుకోవాలి



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   63

తేదీ : 01-02-2016

************************
            కలముపట్టి
         ------------------------

సాహితీ..ఆవేశం..ఏదో ...పూనబట్టి..

మాట ...మాట ..మూటగట్టి..

పదం ...పదం ..వరుసకట్టి..

భావధార...పొంగబట్టి...

మంచి...ఊహ...తట్టబట్టి...

కవితలాగ...మలచబట్టి..

కొందరి..చే...పొగడబట్టి..

మరికొందరు ..బెత్తం ..చేతబట్టి ..

మెత్తగా ..వాత..పడకుండా .కొట్టబట్టి...

కొద్దిగా ..భయం ..వంటబట్టి..

తిప్పి ...తిప్పి...రాయబట్టి...

మంచి...కవితనే..నానుంచి ...రాబట్టి ...

సహస్ర కవుల..అభిమానం..పొందబట్టి..

వారికో...గౌరవ ..నమస్కారం ..పెట్టి ..

వారి..ఆశీస్సులు ..చూపినట్టి..

నా...బుజ్జి ...కవితను...కాపీకొట్టి..

ఊరు...ఊరు...తిప్పబట్టి.
.
ఉచిత ప్రచారం ..ఇయ్యబట్టి...

త్వరలోనే ..అసలు..నిజం ..తెలియబట్టి..

మంచి..  స్నేహితులు...బయట పెట్టి..

అసలు..దోషి ఎవ్వరో ...

త్వరితంగా ...పట్టుబడబట్టి..

నా..కవిత..స్వచ్ఛమని..

ఋజువుచేయబట్టి..

నేను..క్షేమంగా..బయటపడబట్టి...

కాపీరాయుళ్ళ..పై..ఆవేశం ..

లావాలా ..రగలబట్టి...

బాధను..పెదవికింద..తొక్కిపెట్టి..


మనసులోని...ఆత్రాన్ని..ఉగ్గబట్టి...

మంచిరోజుల..కొరకు..ఓపికపట్టి..

నేను..రాయగలిగా..మరి యొక ...కవిత ...

నా..." కలము..చేతపట్టి..".


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   64

తేదీ : 02-02-2016

************************


         పూలగుత్తులు
      ---------------------------
రోజువారీ...పనితొందరలో...

మనసులోని ...విసుగునంతా..

సూట్ కేస్ లో ..దాచిపెట్టి ..

దాని...బరువు ...మోయలేక

సరిగా ...పట్టుకోవడమే...చేతకాక

తమక్రింది..వారికి...

అందిస్తున్నారు ....

అసహనంగా ...ప్రతివారూ ..

ఆఫీసర్లు ..తమ..

గుమాస్తాల కూ..

వాళ్ళు ...తమ...భార్య లకూ...

వారు...వారి..పిల్లల కూ...

పాపం ...వారి కెవరూ...దొరకక

దారినపోయే...కుక్కలకూ...

అవి...జాగింగ్..చేసే ..ఆఫీసర్లకూ...

సూట్ కేసు ...తిరిగి ..తిరిగి

మొదటి కే...వచ్చింది ..


ఎందుకంటే ...

మనం...ఎవరికైనా ...

ఏమివ్వగలమో...

అది...మాత్రమే ...పొందగలం ..

అందుకే...

ప్రోత్సాహం ...

ప్రశంసలు...

అభినందనలు...కలసిన ...

" పూలగుత్తులు.."

తయారుచేసి ...

అవసరమైన ..వారికి..ఇస్తే ..

మనకు...కావలసిన ..సమయానికి ..

రెట్టింపు ...గా...వస్తాయి ..


మనం...ఏమి...ఇవ్వ గలం

సూట్  కేస్ లా...

పూలగుత్తులా...

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   65

తేదీ : 02-02-2016

************************


            అసలు నిజం
         ------------------------
ఇంధ్రభవనం...లాంటి ..మేడలు..

పదిబీరువాల...నిండా..పట్టుచీరలు ..

ఏడువారాల...బంగారునగలు ..

పడవలాంటి...నాలుగైదు ..కార్లూ ..

ఇంటినిండా ...నౌకర్లూ..

వారానికి ...ఒకసారి..వచ్చిపోయే ..

పండంటి ...పిల్లలు ..

నెలలో ..ఏ...రెండుసార్లో..వచ్చిపోయే ..

బిజినెస్ మాగ్నట్..మొగుడూ...

గల....ఒక...అతిలోక సుందరి..కి..

తెల్లవార్లూ ....

పొద్దుగూంకులూ...

షాపింగు లకు..తిరిగినా...

మహిళామండలిలో ..వెలిగినా..

అసూర్యంపశ్యలా...మెలిగినా...

ఎందుకో ..సంతోషం ...

ఆమడ..దూరమే ....


తన...పనిమనిషి ని..గమనిస్తే ..

తాగుబోతు ...మొగుడు
బక్కచిక్కిన ...పిల్లలు
చిరిగిన ...చీరలూ..
ఎంగిలి ...మెతుకులు ...


అయినా ...ఎప్పుడూ ...చిరునవ్వులే..

తనకులేని....ఆనందం ...ఏమున్నదో

అని...తరచి...తరచి..అడిగితే ...

గుచ్చి...గుచ్చి...పోరితే...


జనాభా ...లెక్కలో ..పేరున్నా ..

యజమాని ..కంటికే..ఆనని..

బ్రతికున్న..ఆ...పేదశవం...

చిన్నచిన్నగా...

గొణిగినట్లుగా...పలికింది .


అమ్మా...

నా...మామ...బిడ్డలు

నన్నిడిచి...నా..ఊసుమరచి..

రెండు ..రోజులు కూడా..ఉండలేరు..

బెంగపెట్టుకుని ...పరిగెత్తి ..వస్తారు ..

రేపటి ..రోజు ..కోసం...ఏడుస్తూ

 ఈరోజు ..ఆనందం ..వదులుకోరూ..

ఒక..నవ్వో..ఒక..ఏడుపో..
అంతా...కలిసే ..

ఒక..సంగటిముద్దా...ఇంత గంజో..
అంతా...కలిసే ..

ఒక...కష్టమో...ఒక నష్టమో..
అంతా...కలిసే


మా...పేదరికం ...

మా....  బ్రతుకులకు...మాత్రమే

మా...బంధాలకు..కాదు

మా...మనసులకు...కాదు..

అని..." అసలు నిజం  " తెలిపింది

ఎదుటిముఖం...నిజమెరిగి

వెలవెలపోయి ..వాడింది

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   66

తేదీ : 02-02-2016

************************

      ఎవరైతే ...ఏంటీ..
-----------------------------------
వాళ్ళు ...చెప్పేది...నిజమని
నోరు తెరుచుకొని ..విన్నామా..

వాళ్ళు ..ఇచ్చిన ...హామీలు ..
నెరవేరుతాయని...నమ్మామా..

ఎండలో ...గంటలు...గంటలు

క్యూలో ..నిలబడ్డామా...

చూసి..చూసి...గుద్దామా
..

అంతే ...చాలు

అదే ..మన..పని..

ఫలితాలు ...తెలిసాక..

వాళ్లయినా ...ఒక్కటే

వీళ్ళయినా...ఒక్కటే

ఎందుకంటే ...

వాళ్ళంతా ..ఎప్పటికీ..ఒక్కటే

అంతా...ఒక...తక్కెడ ..సరుకే...

అంతా...ఆ...తాను...గుడ్డే...

" ఎవరైతే ...ఏంటీ ..."

మనలోనే...ఉద్వేగాలు ..

వాళ్ళంతా ...సరదాకే..

మాట ...తూలినా...

నోట్ల...కట్టలు...చేతులు..మారినా..

ఓడేది...పేదరికం ...

  ఇంక... గేలిచేది...

 "  ఎవరైతే ...ఏంటీ.."

   సర్వే జనాః..సుఖినో భవంతు


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   67

తేదీ : 03-02-2016

************************


    సీతాకోక చిలుకలు
------------------------------------

పొగడ్త లూ...

అభినందనలూ...

మెచ్చుకోలూ...వంటి

ముద్దుముద్దు..రూపాల..

సీతాకోక చిలుకలు ...

నన్ను...అమితంగా...ఆకర్షించేవి..

వాటిని...కాసేపు ..అయినా...

పట్టుకోవాలని ...మనసు..

  తెగ...   ఉవ్విళ్ళూ రేది.
 
అస్తమానం ...వాటికోసం ..
వాటి వెనుకే ...పరిగెత్తే ..దాన్ని..

అవి...నన్ను...ఊరించి ...ఉడికించి ..

అందినట్లే...అంది...ఎగిరిపోయేవి

దూరం నుంచి ..చూసి ...

 అందుకో..చూద్దాం ...అని

 అల్లరి గా...    ఉడకాడించే వి

నేను...నా...పనులలో ..మునిగి

లోకాన్ని ...మరచి...

శ్రమలో నే ...తరించి..

విజయాన్ని ...వరించి..

తలపైకెత్తి ...చూద్దును ..కదా....

నా...చుట్టూ ....

కురిసిన ...వెన్నెలలా...
తరగని ...వన్నెల లా...
మెరిసిన...చిన్నెల లా...

బుజ్జి...బుజ్జి ..

బుల్లి ...బుల్లి ..                

" సీతాకోక చిలుకలు "


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   68

తేదీ : 03-02-2016

************************
   
      వంటింటి ..మంట
  ----------------------------------

ఒక..కోమలాంగి...
తన..ఇంటాయన ను..

గరిటె ..పట్టించి...వంటింటి కి..
పంపెనని...తెలిసికొని..

కొందరు...మగవారు
పాపం ..మగవానితో..వంటా..
ఎంత...దౌర్జన్యం ..అని
గుండెలు...బాదుకోగా...

మరికొందరు ..ఆడవారు..
రుచి...పచి..ఉన్నదో ..లేదో నని
నొసలు...చిట్లిచ్చారు..

కానీ...సరసమెరిగిన..ఆ..జంట..
మురిపెంగా...నవ్వుకుంటూ..

గరిటె..తిప్పు...చేయి
ఎవరిదైతే ..నేమి...

వంట...లోన..రుచులు..
తడబడితే..నేమి..

నీకు...సేవ...చేయు..భాగ్యము
దొరుకటయే...పదివేలు

నీవు..వండిన ..చాలు ...అది
అమృతము తో ..సరిపోలు..

అని...కొసరి..కొసరి
తినిపించుకున్నారు

ఎవరి .." వంటింటి..మంట "
మనకెందుకంట...

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   69

తేదీ : 02-02-2016

************************

ప్రియా ...


నీ...కంటి ..మెరుపు...
నా...మదిలోని...వలపు..

నీ...పెదవి..ఎరుపు ..
తొలి..పొద్దు..పొడుపు ..

నీ..తియ్యని ..పిలుపు ..
నా...కవితలకు..మేలుకొలుపు




🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   70

తేదీ : 04-02-2016

************************

ఆరు..ఋతువుల..పరిమళం
-----------------------------------------------

వసంత ఋతువు ..రావడం..
లేతచిగురులు..తేవడం ..
గ్రీష్మ ఋతువు ..రావడం ..
మండే..ఎండలు..తేవడం ..
వర్ష ఋతువు..రావడం ..
వానజల్లులు...తేవడం ..
శరదృతువు...రావడం ..
చల్లని..వెన్నెల...తేవడం..
హేమంత ఋతువు ..రావడం ..
మంచు..తెమ్మెరలు..తేవడం ..
శిశిర ఋతువు రావడం ..
ఎండిన ఆకులు ..రాలడం ..

ప్రకృతిలో ...ఎంత..సహజమో...

కాస్సేపు ...ఆనందాలూ
మరికాసేపు ...విషాదాలూ

కొంత...ఉల్లాసాలూ...
మరికొంత...నీరసాలూ...

కొన్ని ...పొగడ్తలు ...
మరికొన్ని ...విమర్శలు ...


ప్రతివారి...జీవితంలో ...
అంతే ...సహజం ..

ఎవరయితే ..వాటన్నిటినీ ..
అందంగా...అమర్చుకుం టారో ...
మనసును...మమతల..పొదరిల్లు..లా...
ఆనందంతో ..తీర్చిదిద్దుకుంటారో...

వారి...జీవితంలో ..గుభాళిస్తుంది..

" ఆరు..ఋతువుల..పరిమళం  "

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   71

తేదీ : 04-02-2016

************************

 నాన్న చెప్పిన నాలుగు దశలు
---------------------------------------------------

కవితలు...రాయడం ..ప్రారంభించిన
తొలినాళ్ళలో ...
ఎదుర్కొంటున్న ..విమర్శ లు..నచ్చక
నాన్న..దగ్గరకు ...వెళ్ళి ..
ఇక..నేను ..కవితలు..రాయను..
అని...ఉడుక్కునేదాన్ని..

నాన్న...నవ్వి..
ఒక కళను..అభ్యసించేటప్పుడు ..
ఎదురయ్యే ...మొదటి దశ
 ఇదే ...  "విమర్శల దశ"
ఇప్పుడే..సహనం ..అవసరం..అన్నారు


తరువాత కొన్నేళ్ళకి...
నాన్న..దగ్గరికి..ఛెంగున.వెళ్ళి ..
చూడండి ..ఎన్ని..ప్రశంసలో...అని..
ఆనందంతో ..పొంగిపోయేదాన్ని.


నాన్న..నవ్వుతూ ..
ఒక...కళను...అభ్యసించేటప్పుడు...
ఎదురయ్యే ...రెండవదశ
ఇదే .."ప్రశంసలదశ"
ఇప్పుడే ..జాగ్రత్త ..అవసరం ..అన్నారు

ఇంకొక .. కొన్నేళ్ళకి...
కొంత..అసంతృప్తి..కలగడం తో ..
నాన్న..దగ్గరికి ..వెళ్ళి ..
విషయం...ఇంకా..ఎంతో..తెలుసుకోవాలి
అని..ఆత్రుతగా అడిగేదాన్ని

నాన్న..నవ్వుతూ ..
ఒక...కళను...అభ్యసించేటప్పుడు...
ఎదురయ్యే ...మూడవదశ
ఇదే.."అంకితమైన దశ "
ఇప్పుడే ..కార్యదీక్ష ..అవసరం ..అన్నారు



చాలా...చాలా..ఏళ్ళకి
మదిలో..విరిసిన ..ప్రశాంతతతో..
నాన్న..దగ్గరికి ..వెళ్ళి ..
ఇప్పుడు ..ఒక..కావ్యాన్ని ..రాస్తానని ..
సంతోషం ..గా..ముందుకు...కదిలాను

సహజంగా ..నవ్వే..నాన్న..

గంభీరంగా ...చూస్తూ ..
ఒక..కళను..అభ్యసించే టప్పుడు..
ఎదురయ్యే ..నాల్గవదశ
ఇదే..."సేవాభావము దశ"
ఇప్పుడే ..లోకదృష్టి ..అవసరం ..అన్నారు

"నాన్న..చెప్పిన..నాలుగు...దశలు "
అవి..మాములు..మాటలు ..కావు
మదిలో ..నాటి న..విత్తనాలు ..

అన్న..సూక్ష్మాన్ని..గ్రహించి ..

వారి..మేధస్సును ..ప్రణుతించాను
వారి..ఆశీస్సు కై..ప్రణమిల్లాను..


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   72

తేదీ : 05-02-2016

************************

        సంస్కరణ
     -------------------------
మెదడు లోని కి..వెళ్ళే..
ప్రతీ ఆలోచన...
 సంస్కరింప బడుతుంటే..

మనసులో ..నుంచి..వచ్చే
ప్రతి..ఆలోచన.. సంస్కరింపబడే..వస్తుంటే..

జాగృతికి ..
స్వాగతం ..పలుకుదాం

" సంస్కరణ "  కు..
ఆహ్వానం ..చెబుదాము


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   73

తేదీ : 05-02-2016

************************

               ప్రగతి
          --------------------
దేశ ఉజ్వల ..భవిష్యత్తు  ను
రూపకల్పన ..చేయాల్సిన ..
మేధావుల ..జాడేదీ?

అవకాశాలు ...కల్పించి ..
కొందరిని ..విదేశాలకు ....
అవకాశాలే...లేకుండా ..చేసి
మరికొందరిని...అడవులకూ
మిగిలిన ...వారిని...
నీకెందుకు ...ఊరుకో..
నీకెందుకు ...ఊరుకో ...
అని...మౌనముద్రలోకి..

మొత్తానికి ...
మేధావుల నందరినీ ..

దూరంగా ..నెడుతుంటే..
జారవిడుచుకుంటుంటే..

ఇక..ప్రతిభకు..విలువేది..

ఇంక.." ప్రగతి "..కి...చోటేది..


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి 

No comments:

Post a Comment