Friday, February 5, 2016

భ్రమర కవనాలు 2 (సంఖ్య 51నుండి)

                      భ్రమర కవనాలు 51 నుండి

పేరు  : గంజాం. భ్రమరాంబ
ఊరు : తిరుపతి

కవిత సంఖ్య :   51

తేదీ : 26-01-2016

************************

త్రివర్ణ పతాకపురెపరెపలు
-------------------------------------

పేద..ధనికుల ...మధ్య ..
తగ్గుతున్న...అంతరం

ఆడ...మగల...మధ్య ..
పెరుగుతున్న ..సహకారం

కులాల కు ...అతీతంగా..జరిగే
లౌకిక వాద ఎన్నికలు

ప్రజల ...భాగస్వామ్యం తో
వెల్లివిరిసే ...ప్రజాస్వామ్యం


సామాన్యుల  ఓటుహక్కు కున్న...
ఎనలేని ..ప్రాధాన్యం ...

చట్టం ...ముందు ...అందరూ
సమానులన్న...వాస్తవం

ఉజ్వల.....భారతదేశ
చిన్నారులు..చక్కగా ..విన్నారు

రాజ్యాంగ నిర్మాతలకు
జేజేలు....పలికారు

గొప్ప వారి...త్యాగాలను
ముక్తకంఠంతో ..పొగిడారు


నేటి ..లేతమనసు..బాలలనూ

రేపటి ...బాధ్యత గల..పౌరులనూ

సంతృప్తి గా వీక్షిస్తూ...

వారిపైన ...ఎనలేని ..
అభిమానం..ఒలికిస్తూ ..


అగ్రరాజ్యాల ...సరసన
సముచిత ..స్థానం ..కై..

శాస్త్ర ...సాంకేతిక ..రంగాల
అభివృద్ధి ని...సాధిస్తూ ..

కొత్త ఆశలతో ..

సరికొత్త ..ఆకాంక్షలతో..

ఎగురుతున్నది...


మన..సగర్వ..మువ్వన్నెల..పతాకం


"త్రివర్ణ పతాక రెపరెపలు"

భారతదేశ ప్రగతికి ప్రతీకలు..

జయహో...జవాన్

జయహో...కిసాన్

జయహో...భారత్


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి


అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   52

తేదీ : 26-01-2016

************************

             తదితరులు
     ----------------------------
జండా పండుగ నాడు
పాఠశాలకు  పెద్ద పెద్దవాళ్ళు
వస్తున్నార న్న...కబురు

గుండెల్లో ...గుబులుపుట్టించగా...

వారం ..రోజుల ముందునుంచే
బడి...అంతా...హుషారుగా
శుభ్రంగా ...తయ్యరయ్యింది


పెద్ద..పెద్దవాళ్ళు ...

సమయానికి వచ్చి...

జెండాను..ఎగురవేసి...

ఫోటోలకు..ఫోజులిచ్చి..

జేజేలు ...స్వీకరించి..

అభయాలు...ప్రసాదించి..

నిమిషాల కే...అలిసిపోయి ...

క్షణాల్లో ...తుర్ర్..మంటే..

వారి...భజనగణం..పేల్చి న..టపాసులు...

అవి..మిగిల్చిన..చెత్తచెదారాలు..

ఊడ్చిన...చేతులు
ఊడ్పించిన...గొంతులు

అలసట తో కూలబడితే

పిల్లల ఉత్సాహం ...
ఉపాధ్యాయుల..ప్రోత్సాహం ..

బడలికతో.. .సోలిపోతే..

కార్యక్రమ వివరాల లో
పతాక శీర్షికల ను ...
పెద్ద ...పెద్ద..వాళ్ళు ...
ఆక్రమించగా....


కార్యక్రమ నిర్వహణ కు
రేయింబవళ్ళూ...కృషి చేసి..
అలసి పోయిన...
సిబ్బంది...
పిల్లలు ...
వార్తావిలేఖరులు..
అమాయక ప్రజానీకం..

" తదితరులు  "...గా

గుర్తిపబడ్డారు...


శ్రమించడానికి...వెనుకాడనీ..
గుర్తింపు కు...నోచుకోని ...

ఇలాంటి .." తదితరులు  "

గ్రామాలలో..
పట్టణాలలో...
రాష్ట్రాలలో ..
దేశాలలో ...
ఎందరో ...ఎందరెందరో ...

ఎందరో...మహానుభావులు..

అందరికీ ..వందనాలు

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   53

తేదీ : 27-01-2016

************************
     
       ఆనందోబ్రహ్మ
    ----------------------------

ప్రతివారూ ..కావాలీ.అని..కోరుకునే...

ఏ..ఒక్కరూ...వద్దు...అని ...చెప్పలేని..

 నిజమైన..   ఆనందానికి ..  మూలం ..

ఏమిటా...అని..ఎన్నో...చోట్ల ..

ఎన్నో రకాలుగా .....వెతికి చూసాను

చాలా...చోట్ల...దొరికింది ..కూడా..

మనకు ఇష్టమైన వారి..సమక్షంలో ...

మనకు...నచ్చిన...పనిలో ...

మనకు..ప్రేరణ ..నిచ్చే ..పుస్తకంలో..

భగవంతుని.. సన్నిధి లో ..

అలా ...చాలా ...చోట్ల..దొరికింది ..


కానీ...ఆ...సుదూర..ప్రయాణం ..

ఒక...విషయం ...స్పష్టంగా ..తెలిపింది

ఆనందం ..అనేది...ఎక్కడో
వెతికితే ..దొరికే ..వస్తువు..కాదనీ


ఎవరికి..వారే ..సృష్టించు కోవాలి ..అనీ..

మనిషికి ...పరీక్షలు ..పెట్టి ..
ఆనందించే ... తెలివైన ..దేవుడు...

లంకె బిందెలలో ..నగలను ..దాచినట్టుగా

వారి...వారి...మనస్సులో ..నే..

ఆనంద..నిధులను..దాచిపెట్టాడు

అంతర్ముఖంగా ...వెళ్ళి ...వెతికే ..

దొరికినోళ్లకు...దొరికినంత....

తెలుసుకున్న వాళ్ళకు ..తెలుసుకున్నంత
 
  అనంతం ...అపూర్వం... అపురూపం..

      "ఆనందోబ్రహ్మ .."

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   54

తేదీ : 27-01-2016

************************

    కాస్త ...ఆలోచించండి
--------------------------------------


తల్లిదండ్రుల ఆప్యాయతలు

అక్కా తమ్ముళ్ళ అనురాగాలు

అవ్వా తాతల మురిపాలు

స్నేహితుల తో ఆటపాటలు

ఇవేవీ ...లేకుండా

మార్కులే...ధ్యేయం గా

పోటీ పరీక్షలే...పరమావధిగా

హాస్టల్లో ....తొక్కిపెట్టి

వారి...మనస్సుల్ని..నొక్కి పట్టి...


సిలబస్‌ ను బాగా రుబ్బించి

లీటర్ల కొద్దీ...త్రాగించి

గాలన్ల కొద్దీ..కక్కిస్తుంటే

ఊపిరాడని ...పిల్లలు


అయితే ..గియితే

మంచి...ఆఫీసర్లు ...

పెద్ద..కోటీశ్వరులూ...

అవుతారేమో ...గానీ

మంచి...మనుష్యులు

ఎలా...అవగలరూ...

మనస్సు న్న...పెద్దలారా...

" కాస్త ..ఆలోచించండి "

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   55

తేదీ : 28-01-2016

************************

అభిలషనీయమైన...మార్పు
-------------------------------------------------

సమాజం ..ముందు కొచ్చి

నిలుచున్న ...ప్రతి మార్పు ..

తనతో పాటు ...

ఎగతాళి ...ని

విమర్శల...ని

హేళనల...ని

ఛీత్కారాల...ని

శల్యపరిశోధన ల...ని

వ్యతిరేకతల...ని


వెంట...తీసుకొని ..వస్తుంది.

ఈ...అలజడులు ...అన్నింటినీ ..

దీటుగా ....ఎదుర్కోలేని

 చిన్న చిన్న  మార్పులు

కాలప్రవాహంలో...

కొట్టుకొని ...పోతాయి


ఏ...మార్పులు ...అయితే

ఎటువంటి ...ఎదురు దెబ్బలను

సైతం ...తట్టుకొని...ఠీవిగా...

నిలదొక్కు కుంటుందో...

చరిత్రలో ..అది..శాశ్వతంగా ..

మిగిలిపోతుంది ...


అదే ..." అభిలషనీయమైన..మార్పు "

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   56

తేదీ : 28-01-2016

************************

        త్యాగరాజస్వామి
---------------------------------------

తెలుగువారి ...మనస్సు లోగిళ్ళ లో ..

 శాస్త్రీయ సంగీత  ..ఆనవాళ్ళలో..

కదలాడే వారు.. ఎవరు వారు..


సరి...గరిమ...గల స్వరరాజు...వారు

సరిగమల... శ్రీ ...త్యాగరాజు వారు

వందల సంవత్సరాలు గా

శిష్య...పరంపర ను...

కొనసాగిస్తున్న గురురాజు వారు

ఎంతో ...పేదరికం లో ..మగ్గినా...

రామ...నామమే...తన..సంపదగా....

భావించి ...రచించి...సంకీర్తించిన

వాగ్గేయకారులు..వారు ..

.....

నిధి...చాలా ...సుఖమా

రాముని ..సన్నిధి ..సేవ...సుఖమా


.......
జగమే లే...పరమాత్మ ...

ఎవరితో ...మొరలిడుదూ...

....
గగనానికి...ఇలకూ...

బహుదూరంబనినాడో

......
మరుగేలరా ...
ఓ...రాఘవా...

....

అన్నీ..నీవనుచూ..అంతరంగమునా..

తిన్నగా ..వెతకి...తెలిసికొంటినయ్యా..

....
రోమాంచమనే...ఘన..కంచుకము

రామ భక్తుడ నే...ముద్రబిళ్ళయూ...

రామనామమనే...వరఖడ్గమిది...

......

బంటు రీతి కొలువు...

ఇయ్యవయ్య...రామా...

.....


మనసులో ని మర్మమునూ..
తెలుసుకో...

.......
కనికరమ్ముతో...ఈవేళ ...
నాకరము...బట్టు ...

అంటూ

ఎన్నో...సంకీర్తనల...మహత్యాన్ని..

రుచి..చూపిన...మహనీయు డు

శాస్త్రీయ సంగీత ఆరాధన లో ...

ఎందరికో ...ఆదర్శ ప్రాయుడు..

ఎన్నిసార్లు ...అన్నా...

మరెన్నో సార్లు ..విన్నా...

మాధుర్య మే...వినిపించే

మహదానందమే...కలిగించే ...

ఆ..  నాదబ్రహ్మ...స్వరాలకు

భక్తితో ... నమస్కారాలు


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   57

తేదీ : 29-01-2016

************************


            వైరం
       -------------------
ప్రపంచం ... నిదురించాక..

లేత..చిరుగాలి...తాకినట్లు...

నీ...జ్ఞాపకం ...నిద్దురలేస్తుంది

నీ...జ్ఞాపకం ...నిద్రలేచాక..

తెలిమంచు...కరిగినట్లు...

ప్రపంచం ..మాయమవుతుంది

ప్రపంచానికీ....

నీ...జ్ఞాపకానీకి ...మధ్య ..

" వైరం" ఎందుకో ....



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   58

తేదీ : 29-01-2016

************************

          అంతరాత్మ
       ----------------------

ఒక...మంచిపని చేసినపుడు

అభినందిస్తూ ...

ఒక...పొరపాటు ...చేయక ముందే ...

హెచ్చరిస్తూ ...

మనం..చేసిన...ప్రతీ పనినీ ..

సమీక్షిస్తూ ....

భగవంతుని ..మారురూపుగా..వెలిగే

     " అంతరాత్మ" ....కు

        నమోనమామి


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   59

తేదీ : 29-01-2016

************************


   అనురాగాల...కో వెళ్ళు
---------------------------------------
ఆడవారి..పుట్టిళ్ళు...

అనురాగాల...కో వెళ్ళు...


పసిపాపగా...పారాడి..

బుజ్జాయిగా..జోగాడి..

బడుద్దాయిగా...బడికెళ్ళి..

కేరింతలు గా...కళా శాలకెళ్ళి..

మంచి ..ఉద్యోగం ..సాధించి..

పరువానికి..ఎదురెళ్ళి..

కుమారి...శ్రీమతిగా...మారి..

పాత ...ఇంటిపేరు తో ..పాటు..

పుట్టిల్లును...వదిలేసి ..

కొత్త ...కొత్త ...ఆశలతో ..

సరికొత్త ..ఊసులతో..


కొంగ్రొత్త ..ఇంటిపేరు ను..

ప్రేమ గా...  తగిలించుకుని ...

పయనించే..మన...బంగారుతల్లులు...

తమ..పెళ్ళయిన ..కొత్తల్లో ...

పుట్టింటి..వారు..గుర్తుకొస్తే..చాలు


ఫోన్లు చేసి..గంటలు ..గంటలు ..

కబురులే...చెపుతారు.

తరచి...తరచి..

పుట్టింటి..ఊసులే..అడుగుతారు

దిగులెక్కువయితే...వారినే...

పరుగెత్తి ..రమ్మంటారు...


మరి...ఇన్నాళ్ళూ...తిరగాడిన..

 తమ...తమ..   పుట్టిళ్ళే...గుర్తొస్తే..

ఏమీ.. తోచక ...

బిక్క మొఖం..వేస్తారు

బెంగతో..లంఖణాలు..చేస్తారు ..

పండుగలు..ఎప్పుడొస్తాయా...అని

తెగ...ఎదురుచూస్తారు.

కాకితో.. పంపినా..కబురందగానే..

శ్రీ వారి..చెయ్యందుకొని..

చెంగున .. పుట్టింటి లో..వాలిపోతారు

పుట్టిల్లంతా...పదిసార్లు ..

తిరిగి... తిరిగి ...చూస్తారు

ఇష్టమైన..వంటలు

కొసరి ..కొసరి..తింటారు

చిన్నప్పటి ..జ్ఞాపకాలలో

అలసి..పులిసి..పోతారు

ఎందుకో...తెలుసా...

ఆడవారి..పుట్టిళ్ళు...

" అనురాగాల...కో వెళ్ళు.."


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   60

తేదీ : 30-01-2016

************************

        నవరసాలు
    ------------------------

మనిషి జీవితం లో నే  కాదు...
బాగా...గమనిస్తే ....
ప్రకృతి లో నూ..నవరసాలు..
అంతర్లీనంగా..అమరి...ఉన్నాయి...


ఋతువుల...పలకరింతకు...
పులకరించి..కనికరించి...
విరబూసే... మొగ్గలూ..  పూలు...
విరగగాసే...కాయలూ...పండ్లు ...
వానలు..వెన్నెలలూ..చల్లనిగాలులూ..

కరుణ ...రసానికి ..ప్రతీకలు

అతినీలలోహిత ..కిరణాలు
ఓజోన్ ...పొరను...దెబ్బతీస్తుంటే..
దానికి...కారణమవుతున్న
మానవాళి ని...ఇంకేమీ ...
చెయ్యాలో ...అర్థం ..కాక.
చండప్రచండంగా...ఎండచూపుతున్న...
సూర్యుని ...ప్రతాపాలు ..

 రౌద్ర ..రసానికి ..ప్రతీకలు

ప్రత్యూష పవన..వీచికల..సందడికి
నిదురలేచిన...కుసుమాల..
చిరుదరహాసాలు...
శుకపికాది...కిలకిలా ..రావాలు...
తూనీగల..తుళ్ళింతలూ..

హాస్య ..రసానికి ..ప్రతీకలు

వేళకాని..వేళ లలో ..
ఉరుముల తో...మెరుపులతో ..
కుంభవృష్టి ...కురిపించే...
ఒళ్ళు ...ఝల్లు మనిపించే..
కారుమబ్బులకు...హెచ్చరికగా
ఎగసి....రోష...పడుతున్న..
సముద్రం...లోని...కెరటాలు ...

వీర...రసానికి...ప్రతీకలు


ఎన్నోరకాల ...కాలుష్యా లతో ....
మరెన్నో ...రకాల...విధ్వంసాలతో..
అతలాకుతలం అవుతున్న...
మన...ధరిత్రి...ఆస్తులూ
రేపటి తరానికి..అందించే..అవస్థ లూ...

భయానక ...రసానికి ..ప్రతీకలు

ధరతక్కువనే...కారణం తో ..
చిన్న...నుంచీ ..పెద్ద..వరకూ..
అవసరాల..కన్నా...అధికం గా...వాడుతున్న...
ప్రత్యామ్నాయం...తక్కువ గా ...ఉన్న...
ప్లాస్టిక్ ...వాడకాలు...
అది...సృష్టి స్తున్న...అవశేషాలు ..

బీభత్స ...రసానికి ...ప్రతీకలు

దైనందిన ..జీవిత ..ప్రయాణం ..లో
అలిసిపోయి న...హృదయాలు..
సేదతీరడానికి....అరకూ ..
ఊటీ...కొడైకెనాల్...విహారాల్కు..వెళితే ..
ఆహ్వానించే...అందమైన ..మైదానాలు...
కను విందు...చేసే ...
చక్కటి...ఉద్యానవనాలు..
ఆ...ఆనందానికి ...
కాలాలు..ఆగే..క్షణాలు ..

అద్భుత ...రసానికి ...ప్రతీకలు

చల్లని...వెన్నెలరాత్రులూ...
సన్నగా...పారే...సెలయేరులూ...
చిన్నగా...కురిసే ...మంచు..ముత్యాలు ..
మెల్లిగా ...తలలూపే..వరికంకులూ..

శాంత...రసానికి ...ప్రతీకలు


కొండల...చాటుకు...వెళ్ళి..
సాయం సంధ్యను...ముద్దాడినప్పుడు...
కళ్లా ర్పకుండా...చూసిన..
 నీలాకాశపు..బుగ్గల..లోని..
లేత...ఎరుపురంగులు..
అవి..చూపుతున్న..కొంటెతనపు..దారులు

శృంగార ...రసానికి ..ప్రతీకలు

"నవరసాలు"..ప్రజ్వరిల్లి తే..
నీరసాలు...ఆవిరైపోవాల్సిందే.. సుమా..



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   61

తేదీ : 31-01-2016

************************

            జీవిత సత్యం
         ------------------------  
మన..చిన్ని ...జీవితం ..లో ..
తన..నిరంతర ..ప్రవాహంలో ..

కాసేపు ....భుజం తడుతూ..

మరికాసేపు ...సహనాన్ని
పరీక్షించి ...

కన్నింటికీ ...చిరునవ్వు లకీ...మధ్య

ఊయలలూగుతూ...

అడిగింది ...ఇవ్వకుండా..ఏడిపిస్తూ ...

అంతకన్నా ...మంచిదే ...
అందిస్తూ ...

మనకు..రావాలసింది..
ఎప్పటికైనా ...
ఎన్నటికైనా...
మనకు...చేరుతుంది..

అనే ..నమ్మకాలు ..పెంచుతూ..

పని...చేయడం ..నీవంతు..

ఆనందం ..అందించడం ..
నావంతు...

అని...తేల్చిచెప్పే...

శ్రమైకజీవనమే...నిరంతర..
బ్రహ్మానందం ..మహదానందం..

అని...తెలియజెప్పే ...


గొప్ప .. " జీవిత సత్యం "....

అవగతమై తే..నిత్యం ..వసంతం.


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి


అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   62

తేదీ : 31-01-2016

************************

    పొరుగువారు
-------------------------
మతగ్రంధాల...సారాంశాన్ని ..
తెగరుబ్బి...త్రాగామనీ...
పెద్దల...అనుభవాల...సారాన్ని ...

పరిశోధన లే..చేసామని...

విర్రవీగు..కొందరు..వెర్రివారు..

మేధావుల మౌనాన్ని..
అలుసుగా...తీసుకుని..

తమలోని ...అక్కసును..
కవితలా...మలచుకొని...

అసలువిషయం ..మరిచారు..

పొరుగువారిని..ప్రేమించడం ..

ఇతరుల తప్పులు ...తమతప్పులుగా...

భావించి ..మన్నించడం...

ఎదుటివారి..లోని ..మంచిచెడ్డలు ..
ఉన్నదున్నట్లుగా ...స్వీకరించడమే

వారికిచ్చే ..నిజమైన ..గౌరవం ..

అని...మరచిపోయి ..విస్మరించి ..
 కొందరు...వెదుకుతున్నారు...

తెల్లవార్లూ ...పాపం ..

మనకన్నా..ఎక్కువ ..లోపాలు గల

" పొరుగు వారు "..

ఎక్కడుంటారో...చూడాలనీ..

వారి..మనసాక్షి...తిరగబడింది ..

నీ..స్థాయి..ముందు..తేల్చుకోమనీ...

ఒప్పులను ..చాటింపువేసి...
బహిరంగంగా ..చెప్పినా..

తప్పులను..మాత్రం...
 సున్నితంగా ..నే..చెప్పాలి

ఒక్కవేలు..ఎక్కుపెట్టి..చూపిస్తే ..
మూడువేళ్ళు..ఎదురొస్త్తయి..కదా..

అన్నీ..తెలుసు ..అనే..
అహంకారం ..వీడితే...

చిన్న..చిన్న ...తప్పులకు..
మనస్పూర్తిగా ..నవ్వేస్తే..

అప్పుడే .చూడగలం...
 మనసులో పరిమళించే..
 సంస్కార ...దర్శనం ..

అప్పుడే ...చూపగలం...
నిజమైన సంస్కరణ కు..
దారి..చూపే..నిదర్శనం

నిర్దయ..హృదయాలని..

జాలితోనే...కరిగించాలి
ప్రేమతోనే ...కలుపుకోవాలి



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   63

తేదీ : 01-02-2016

************************
            కలముపట్టి
         ------------------------

సాహితీ..ఆవేశం..ఏదో ...పూనబట్టి..

మాట ...మాట ..మూటగట్టి..

పదం ...పదం ..వరుసకట్టి..

భావధార...పొంగబట్టి...

మంచి...ఊహ...తట్టబట్టి...

కవితలాగ...మలచబట్టి..

కొందరి..చే...పొగడబట్టి..

మరికొందరు ..బెత్తం ..చేతబట్టి ..

మెత్తగా ..వాత..పడకుండా .కొట్టబట్టి...

కొద్దిగా ..భయం ..వంటబట్టి..

తిప్పి ...తిప్పి...రాయబట్టి...

మంచి...కవితనే..నానుంచి ...రాబట్టి ...

సహస్ర కవుల..అభిమానం..పొందబట్టి..

వారికో...గౌరవ ..నమస్కారం ..పెట్టి ..

వారి..ఆశీస్సులు ..చూపినట్టి..

నా...బుజ్జి ...కవితను...కాపీకొట్టి..

ఊరు...ఊరు...తిప్పబట్టి.
.
ఉచిత ప్రచారం ..ఇయ్యబట్టి...

త్వరలోనే ..అసలు..నిజం ..తెలియబట్టి..

మంచి..  స్నేహితులు...బయట పెట్టి..

అసలు..దోషి ఎవ్వరో ...

త్వరితంగా ...పట్టుబడబట్టి..

నా..కవిత..స్వచ్ఛమని..

ఋజువుచేయబట్టి..

నేను..క్షేమంగా..బయటపడబట్టి...

కాపీరాయుళ్ళ..పై..ఆవేశం ..

లావాలా ..రగలబట్టి...

బాధను..పెదవికింద..తొక్కిపెట్టి..


మనసులోని...ఆత్రాన్ని..ఉగ్గబట్టి...

మంచిరోజుల..కొరకు..ఓపికపట్టి..

నేను..రాయగలిగా..మరి యొక ...కవిత ...

నా..." కలము..చేతపట్టి..".


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   64

తేదీ : 02-02-2016

************************


         పూలగుత్తులు
      ---------------------------
రోజువారీ...పనితొందరలో...

మనసులోని ...విసుగునంతా..

సూట్ కేస్ లో ..దాచిపెట్టి ..

దాని...బరువు ...మోయలేక

సరిగా ...పట్టుకోవడమే...చేతకాక

తమక్రింది..వారికి...

అందిస్తున్నారు ....

అసహనంగా ...ప్రతివారూ ..

ఆఫీసర్లు ..తమ..

గుమాస్తాల కూ..

వాళ్ళు ...తమ...భార్య లకూ...

వారు...వారి..పిల్లల కూ...

పాపం ...వారి కెవరూ...దొరకక

దారినపోయే...కుక్కలకూ...

అవి...జాగింగ్..చేసే ..ఆఫీసర్లకూ...

సూట్ కేసు ...తిరిగి ..తిరిగి

మొదటి కే...వచ్చింది ..


ఎందుకంటే ...

మనం...ఎవరికైనా ...

ఏమివ్వగలమో...

అది...మాత్రమే ...పొందగలం ..

అందుకే...

ప్రోత్సాహం ...

ప్రశంసలు...

అభినందనలు...కలసిన ...

" పూలగుత్తులు.."

తయారుచేసి ...

అవసరమైన ..వారికి..ఇస్తే ..

మనకు...కావలసిన ..సమయానికి ..

రెట్టింపు ...గా...వస్తాయి ..


మనం...ఏమి...ఇవ్వ గలం

సూట్  కేస్ లా...

పూలగుత్తులా...

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   65

తేదీ : 02-02-2016

************************


            అసలు నిజం
         ------------------------
ఇంధ్రభవనం...లాంటి ..మేడలు..

పదిబీరువాల...నిండా..పట్టుచీరలు ..

ఏడువారాల...బంగారునగలు ..

పడవలాంటి...నాలుగైదు ..కార్లూ ..

ఇంటినిండా ...నౌకర్లూ..

వారానికి ...ఒకసారి..వచ్చిపోయే ..

పండంటి ...పిల్లలు ..

నెలలో ..ఏ...రెండుసార్లో..వచ్చిపోయే ..

బిజినెస్ మాగ్నట్..మొగుడూ...

గల....ఒక...అతిలోక సుందరి..కి..

తెల్లవార్లూ ....

పొద్దుగూంకులూ...

షాపింగు లకు..తిరిగినా...

మహిళామండలిలో ..వెలిగినా..

అసూర్యంపశ్యలా...మెలిగినా...

ఎందుకో ..సంతోషం ...

ఆమడ..దూరమే ....


తన...పనిమనిషి ని..గమనిస్తే ..

తాగుబోతు ...మొగుడు
బక్కచిక్కిన ...పిల్లలు
చిరిగిన ...చీరలూ..
ఎంగిలి ...మెతుకులు ...


అయినా ...ఎప్పుడూ ...చిరునవ్వులే..

తనకులేని....ఆనందం ...ఏమున్నదో

అని...తరచి...తరచి..అడిగితే ...

గుచ్చి...గుచ్చి...పోరితే...


జనాభా ...లెక్కలో ..పేరున్నా ..

యజమాని ..కంటికే..ఆనని..

బ్రతికున్న..ఆ...పేదశవం...

చిన్నచిన్నగా...

గొణిగినట్లుగా...పలికింది .


అమ్మా...

నా...మామ...బిడ్డలు

నన్నిడిచి...నా..ఊసుమరచి..

రెండు ..రోజులు కూడా..ఉండలేరు..

బెంగపెట్టుకుని ...పరిగెత్తి ..వస్తారు ..

రేపటి ..రోజు ..కోసం...ఏడుస్తూ

 ఈరోజు ..ఆనందం ..వదులుకోరూ..

ఒక..నవ్వో..ఒక..ఏడుపో..
అంతా...కలిసే ..

ఒక..సంగటిముద్దా...ఇంత గంజో..
అంతా...కలిసే ..

ఒక...కష్టమో...ఒక నష్టమో..
అంతా...కలిసే


మా...పేదరికం ...

మా....  బ్రతుకులకు...మాత్రమే

మా...బంధాలకు..కాదు

మా...మనసులకు...కాదు..

అని..." అసలు నిజం  " తెలిపింది

ఎదుటిముఖం...నిజమెరిగి

వెలవెలపోయి ..వాడింది

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   66

తేదీ : 02-02-2016

************************

      ఎవరైతే ...ఏంటీ..
-----------------------------------
వాళ్ళు ...చెప్పేది...నిజమని
నోరు తెరుచుకొని ..విన్నామా..

వాళ్ళు ..ఇచ్చిన ...హామీలు ..
నెరవేరుతాయని...నమ్మామా..

ఎండలో ...గంటలు...గంటలు

క్యూలో ..నిలబడ్డామా...

చూసి..చూసి...గుద్దామా
..

అంతే ...చాలు

అదే ..మన..పని..

ఫలితాలు ...తెలిసాక..

వాళ్లయినా ...ఒక్కటే

వీళ్ళయినా...ఒక్కటే

ఎందుకంటే ...

వాళ్ళంతా ..ఎప్పటికీ..ఒక్కటే

అంతా...ఒక...తక్కెడ ..సరుకే...

అంతా...ఆ...తాను...గుడ్డే...

" ఎవరైతే ...ఏంటీ ..."

మనలోనే...ఉద్వేగాలు ..

వాళ్ళంతా ...సరదాకే..

మాట ...తూలినా...

నోట్ల...కట్టలు...చేతులు..మారినా..

ఓడేది...పేదరికం ...

  ఇంక... గేలిచేది...

 "  ఎవరైతే ...ఏంటీ.."

   సర్వే జనాః..సుఖినో భవంతు


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   67

తేదీ : 03-02-2016

************************


    సీతాకోక చిలుకలు
------------------------------------

పొగడ్త లూ...

అభినందనలూ...

మెచ్చుకోలూ...వంటి

ముద్దుముద్దు..రూపాల..

సీతాకోక చిలుకలు ...

నన్ను...అమితంగా...ఆకర్షించేవి..

వాటిని...కాసేపు ..అయినా...

పట్టుకోవాలని ...మనసు..

  తెగ...   ఉవ్విళ్ళూ రేది.
 
అస్తమానం ...వాటికోసం ..
వాటి వెనుకే ...పరిగెత్తే ..దాన్ని..

అవి...నన్ను...ఊరించి ...ఉడికించి ..

అందినట్లే...అంది...ఎగిరిపోయేవి

దూరం నుంచి ..చూసి ...

 అందుకో..చూద్దాం ...అని

 అల్లరి గా...    ఉడకాడించే వి

నేను...నా...పనులలో ..మునిగి

లోకాన్ని ...మరచి...

శ్రమలో నే ...తరించి..

విజయాన్ని ...వరించి..

తలపైకెత్తి ...చూద్దును ..కదా....

నా...చుట్టూ ....

కురిసిన ...వెన్నెలలా...
తరగని ...వన్నెల లా...
మెరిసిన...చిన్నెల లా...

బుజ్జి...బుజ్జి ..

బుల్లి ...బుల్లి ..                

" సీతాకోక చిలుకలు "


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   68

తేదీ : 03-02-2016

************************
   
      వంటింటి ..మంట
  ----------------------------------

ఒక..కోమలాంగి...
తన..ఇంటాయన ను..

గరిటె ..పట్టించి...వంటింటి కి..
పంపెనని...తెలిసికొని..

కొందరు...మగవారు
పాపం ..మగవానితో..వంటా..
ఎంత...దౌర్జన్యం ..అని
గుండెలు...బాదుకోగా...

మరికొందరు ..ఆడవారు..
రుచి...పచి..ఉన్నదో ..లేదో నని
నొసలు...చిట్లిచ్చారు..

కానీ...సరసమెరిగిన..ఆ..జంట..
మురిపెంగా...నవ్వుకుంటూ..

గరిటె..తిప్పు...చేయి
ఎవరిదైతే ..నేమి...

వంట...లోన..రుచులు..
తడబడితే..నేమి..

నీకు...సేవ...చేయు..భాగ్యము
దొరుకటయే...పదివేలు

నీవు..వండిన ..చాలు ...అది
అమృతము తో ..సరిపోలు..

అని...కొసరి..కొసరి
తినిపించుకున్నారు

ఎవరి .." వంటింటి..మంట "
మనకెందుకంట...

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   69

తేదీ : 02-02-2016

************************

ప్రియా ...


నీ...కంటి ..మెరుపు...
నా...మదిలోని...వలపు..

నీ...పెదవి..ఎరుపు ..
తొలి..పొద్దు..పొడుపు ..

నీ..తియ్యని ..పిలుపు ..
నా...కవితలకు..మేలుకొలుపు




🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   70

తేదీ : 04-02-2016

************************

ఆరు..ఋతువుల..పరిమళం
-----------------------------------------------

వసంత ఋతువు ..రావడం..
లేతచిగురులు..తేవడం ..
గ్రీష్మ ఋతువు ..రావడం ..
మండే..ఎండలు..తేవడం ..
వర్ష ఋతువు..రావడం ..
వానజల్లులు...తేవడం ..
శరదృతువు...రావడం ..
చల్లని..వెన్నెల...తేవడం..
హేమంత ఋతువు ..రావడం ..
మంచు..తెమ్మెరలు..తేవడం ..
శిశిర ఋతువు రావడం ..
ఎండిన ఆకులు ..రాలడం ..

ప్రకృతిలో ...ఎంత..సహజమో...

కాస్సేపు ...ఆనందాలూ
మరికాసేపు ...విషాదాలూ

కొంత...ఉల్లాసాలూ...
మరికొంత...నీరసాలూ...

కొన్ని ...పొగడ్తలు ...
మరికొన్ని ...విమర్శలు ...


ప్రతివారి...జీవితంలో ...
అంతే ...సహజం ..

ఎవరయితే ..వాటన్నిటినీ ..
అందంగా...అమర్చుకుం టారో ...
మనసును...మమతల..పొదరిల్లు..లా...
ఆనందంతో ..తీర్చిదిద్దుకుంటారో...

వారి...జీవితంలో ..గుభాళిస్తుంది..

" ఆరు..ఋతువుల..పరిమళం  "

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   71

తేదీ : 04-02-2016

************************

 నాన్న చెప్పిన నాలుగు దశలు
---------------------------------------------------

కవితలు...రాయడం ..ప్రారంభించిన
తొలినాళ్ళలో ...
ఎదుర్కొంటున్న ..విమర్శ లు..నచ్చక
నాన్న..దగ్గరకు ...వెళ్ళి ..
ఇక..నేను ..కవితలు..రాయను..
అని...ఉడుక్కునేదాన్ని..

నాన్న...నవ్వి..
ఒక కళను..అభ్యసించేటప్పుడు ..
ఎదురయ్యే ...మొదటి దశ
 ఇదే ...  "విమర్శల దశ"
ఇప్పుడే..సహనం ..అవసరం..అన్నారు


తరువాత కొన్నేళ్ళకి...
నాన్న..దగ్గరికి..ఛెంగున.వెళ్ళి ..
చూడండి ..ఎన్ని..ప్రశంసలో...అని..
ఆనందంతో ..పొంగిపోయేదాన్ని.


నాన్న..నవ్వుతూ ..
ఒక...కళను...అభ్యసించేటప్పుడు...
ఎదురయ్యే ...రెండవదశ
ఇదే .."ప్రశంసలదశ"
ఇప్పుడే ..జాగ్రత్త ..అవసరం ..అన్నారు

ఇంకొక .. కొన్నేళ్ళకి...
కొంత..అసంతృప్తి..కలగడం తో ..
నాన్న..దగ్గరికి ..వెళ్ళి ..
విషయం...ఇంకా..ఎంతో..తెలుసుకోవాలి
అని..ఆత్రుతగా అడిగేదాన్ని

నాన్న..నవ్వుతూ ..
ఒక...కళను...అభ్యసించేటప్పుడు...
ఎదురయ్యే ...మూడవదశ
ఇదే.."అంకితమైన దశ "
ఇప్పుడే ..కార్యదీక్ష ..అవసరం ..అన్నారు



చాలా...చాలా..ఏళ్ళకి
మదిలో..విరిసిన ..ప్రశాంతతతో..
నాన్న..దగ్గరికి ..వెళ్ళి ..
ఇప్పుడు ..ఒక..కావ్యాన్ని ..రాస్తానని ..
సంతోషం ..గా..ముందుకు...కదిలాను

సహజంగా ..నవ్వే..నాన్న..

గంభీరంగా ...చూస్తూ ..
ఒక..కళను..అభ్యసించే టప్పుడు..
ఎదురయ్యే ..నాల్గవదశ
ఇదే..."సేవాభావము దశ"
ఇప్పుడే ..లోకదృష్టి ..అవసరం ..అన్నారు

"నాన్న..చెప్పిన..నాలుగు...దశలు "
అవి..మాములు..మాటలు ..కావు
మదిలో ..నాటి న..విత్తనాలు ..

అన్న..సూక్ష్మాన్ని..గ్రహించి ..

వారి..మేధస్సును ..ప్రణుతించాను
వారి..ఆశీస్సు కై..ప్రణమిల్లాను..


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   72

తేదీ : 05-02-2016

************************

        సంస్కరణ
     -------------------------
మెదడు లోని కి..వెళ్ళే..
ప్రతీ ఆలోచన...
 సంస్కరింప బడుతుంటే..

మనసులో ..నుంచి..వచ్చే
ప్రతి..ఆలోచన.. సంస్కరింపబడే..వస్తుంటే..

జాగృతికి ..
స్వాగతం ..పలుకుదాం

" సంస్కరణ "  కు..
ఆహ్వానం ..చెబుదాము


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   73

తేదీ : 05-02-2016

************************

               ప్రగతి
          --------------------
దేశ ఉజ్వల ..భవిష్యత్తు  ను
రూపకల్పన ..చేయాల్సిన ..
మేధావుల ..జాడేదీ?

అవకాశాలు ...కల్పించి ..
కొందరిని ..విదేశాలకు ....
అవకాశాలే...లేకుండా ..చేసి
మరికొందరిని...అడవులకూ
మిగిలిన ...వారిని...
నీకెందుకు ...ఊరుకో..
నీకెందుకు ...ఊరుకో ...
అని...మౌనముద్రలోకి..

మొత్తానికి ...
మేధావుల నందరినీ ..

దూరంగా ..నెడుతుంటే..
జారవిడుచుకుంటుంటే..

ఇక..ప్రతిభకు..విలువేది..

ఇంక.." ప్రగతి "..కి...చోటేది..


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి 

భ్రమర కవనాలు


పేరు  : గంజాం. భ్రమరాంబ
ఊరు : తిరుపతి


కవిత సంఖ్య : 1

************************

ఆ చేతులకు వందనం
--------------------------------

ఆ చేతులు

నన్ను నవ్వించడానికి
చక్కలిగింతలు పెట్టాయి.

నేను కార్చిన కన్నిటికి
దోసిళ్లు  పట్టాయి

నా విజయాల వెనకాల
వెన్ను తట్టి నిలిచాయి

నా అపజయాల వేళల్లో
భుజం పట్టి నిలిపాయి

దుర్మార్గపు బాటవైపు
గోడలా నిలిచాయి

సన్మార్గపు దారులను
వారధి లా కలిపాయి

ముళ్ళ బాధ తామెరిగి
పువ్వులనే పరిచాయి

చేదునంతా స్వీకరించి
తీపి రుచే చూపాయి

నా గెలుపు తోటి చప్పట్లు గా

నా విజయ సంకేతాలు గా

మౌనంగా  మిగిలాయి
 నా జ్ఞాపకాలనే తడిమాయి

శిలలాంటి మనసును
శిల్పం గా మార్చాయి

జ్ఞాన జోతి ఆరకుండా

గుప్పెటగా మారాయి

ఆ చేతులు

నా హితులవి
సన్నిహితులవి

నా మది మందిరపు స్నేహితులవి.


కవిత సంఖ్య : 2
************************
ప్రేమ తాంబూలం
--------------------------------

ప్రియా
నువ్వు వస్తావన్న
ఆనందం  లో
తాంబూలం తయారు చేసాను...
నవ్వు రావడం కాస్త  ఆలస్యం అవడంతో
చిగురుటాకు యవ్వనం
ఆకులా వాడినా
నునుసిగ్గుల కోరికలు
సున్నం లా కరిగినా
నీ పైన నాకున్న ప్రేమ మాత్రం
అదరక బెదరక
చెక్కు చెదరక
వక్కలా నిలిచింది
స్వీకరించి చూడు
నీ  నోరే కాదు
మన వలపూ పండును
🙏🙏🙏🙏🙏


కవిత సంఖ్య : 3
************************
      విశ్వరూపం
--------------------------------

నేనెవ్వరో   తెలుసునా ...
నేనేమిటో  తెలుపనా ...

కృత యుగంలో.....
నీ పాదాల చేరిన పుష్పాన్ని  నేను
నీ మెడను అలంకరించిన
పూదండ  నేను

త్రేతాయుగం లో ...
మధుర ఫలముల నందిచిన శబరి  నేను
కలనైన మరపురాని  సీత నేను

ద్వాపరము లో ...
నీ  అధర పల్లవమంటిన
మురళి నేను
నీ మదినాక్రమించిన
రాధ నేను

కలియుగంలో ...
నిన్ను మురిపాల తేలించు
ప్రియురాలు నేను
నీ సౌభాగ్యాన్ని  పొందిన
ఇల్లాలు నే ను
కావ్యాలలోన...
అభిసారిక ను నేను
విరహోత్కంఠిత నేను
కవి హృదయం లో...
ఊర్వశి  నే ను
కిన్నెరసాని నే ను

వైకుంఠ మందున...
శేష తల్పము నేను
శ్రీలక్ష్మి హస్తము ను  నేను

కైలాస గిరి లో...
అర్థనారీశ్వరీ నేను
తలనుండు గంగనూ నేను

బ్రహ్మ లోకమున...
నారదుని మహతి నేను
సరస్వతీ దేవి కచ్చపి నేను

స్వర్గంబు దారిలో...
అమృతంబు నే ను
వైతరిణి నే ను

నీ హృదయ మందిరాన...
స్పందించే నాడి నేను
నిదురించు చెలి నేను

ఇన్ని  రూపాలలో ...
ఇన్ని లోకాలలో ...
నిన్ను   అలరించుటకై పుట్టాను
నిన్ను  సేవిస్తూ నే ఉంటాను

🙏🙏🙏🙏🙏



కవిత సంఖ్య :  4

************************

దాహం - ఆకలి
-------------------------

ప్రియా...
ఒకసారి  ఇలా దగ్గిరికి రా...
నీళ్ళేంత త్రాగినా
తీరని దాహం
నీ పెదవి తీరుస్తుందేమో
అని  చూడనీ....
అమృతమెంత తాగినా
తీరని ఆకలి
నీ కౌగిలి తీరుస్తుందేమో
అని   వేచనీ...
🙏🙏🙏🙏🙏


కవిత సంఖ్య :  5
************************
దీపాలు
------------
నాలుగైదు రాళ్ళను
పగలగొట్టాకే
ఒక అరుదైన శిల్పం
రూపొందుతుంది
రెండు మూడు ప్రాణాలతో
ఆడుకున్నాకే
శస్త్రచికిత్స లో  నైపుణ్యం
అబ్బుతుంది
చుట్టు పక్కల వాళ్ల
చెవుల తుప్పూడినాకే
అందమైన రాగం
అలరారుతుంది
ఉప్పుకారాలసారం
ఎక్కువతక్కువలైయ్యాకే
రుచికరమైన వంటగా
పొయ్యిమీద కెక్కుతుంది
విమర్శ ల వడగళ్ళకు
బెదిరిపోకుండా
పొగడ్తల పూజల్లులకే
ఆగిపోకుండా
ఉల్లాసంగా, ఉత్సాహంగా
ముందుకెళ్ళితేనే
మనసుకు నచ్చిన కవిత
ఆకృతి దాల్చుతుంది
అందమైన అనుభవాలకు
ఓపికలే దీపాలు
🙏🙏🙏🙏🙏

కవిత సంఖ్య :  6
***********************
శ్రీవారికి జోహారు
---------------------------

నా చిన్నచిన్న పొరపాట్లను
తల్లి లా ఓర్చావు
అవి తప్పులై పోకుండా
తండ్రి లా సరిదిద్దావు
మంచిచెడ్డలు నేర్పేటప్పుడు
గురువులా మారావు
ధైర్యాన్ని నూరిపోసేటప్పుడు
కృష్ణుడు వైనావు
ధర్మ దర్శనం చేయించి
రాముడివైనావు
కష్టసుఖాలలో చేయివీడని
నేస్తానివైనావు
ఏడడుగుల నడకతో
జన్మ బంధమైనావు
చిన్ని కృష్ణుడు ని   చేతికిచ్చి
హోదాను పెంచావు
వంట నేనైతే
రుచివి  అయ్యావు
కలము నేనైతే
కవిత వయ్యావు
పెదవి నేనైతే
చిరునవ్వు వైనావు
పదము నేనైతే
నడక వయ్యావు
బాట నేనైతే
దీపం అయ్యావు
జీవితం నేనైతే
స్ఫూర్తి  వైనావు
ఇహము నే నైతే
పరము అయ్యావు
జీవితపు ప్రతి మలుపులో
తొలి  వేకువ వయ్యావు
వయసైన కాలానికి
ఆలంబన సంధ్యవైనావు
అందుకే
శ్రీ వారూ నీకు నా జోహారు
🙏🙏🙏🙏🙏


కవిత సంఖ్య :  7
************************
నిరంతర విద్యార్థి
------------------------------
నేనొక నిరంతర విద్యార్థినీ
నాకెప్పుడూ ..
ఇంకా ఏదో నేర్చుకోవాలి
 అనీ  అనిపిస్తూ ఉంటుంది
రాళ్ళు విసిరిన వారికీ
తియ్యని పండ్లను ఇచ్చే
పచ్చని చెట్లను చూస్తే ..
వేపపూల చుట్టూ తిరిగి
ఒడుపుగా మకరందాన్ని
తాగేటి భ్రమరాన్ని చూస్తే ..
నిరంతరం  శ్రమిస్తూ
అలుపెరుగని రైతన్న
చిందించే స్వేదం చూస్తే ..
కుమ్మరి చక్రం పైకెక్కి
బంకమట్టి ముద్ద
సట్టిగా మారే తీరు  చూస్తే ..
చిన్న వర్ష పు జల్లు కే
మట్టి వాసన విరజిమ్మే
నేలతల్లి ఆశ ను చూస్తే ..
విశ్రాంతి నెరుగక
ప్రతీ రోజూ ఉదయించే
రవికిరణాన్ని   చూస్తే ..
సూర్యుని  వేడిని కూడా
చల్లని వెన్నెల గా  మార్చ
చిలిపి చంద్రుడి ని చూస్తే ..
ఒకరోజు   ఆయస్సు తో
అల్లంతదూరానికి  వీచే
పూల పరిమళాన్ని  చూస్తే ..
రేపటి గురించి ఆలోచన లు
మూలకి విసిరికొట్టి
హాయిగా చిగురించే నవ్వు చూస్తే ..
తపన పడే మనస్సు లో
ఉరకలేసే కవిత్వంలో
జాలువారిన భావాన్ని చూస్తే ..
ఇంకా ఏదో నేర్చుకోవాలి
 అనీ  అనిపిస్తూ ఉంటుంది
🙏🙏🙏🙏🙏


కవిత సంఖ్య :   8
************************
ముందు - వెనుకా
--------------------------
గొంగళి పురుగు  -  ముందు
సీతాకోకచిలుక  -  వెనుక
హాలాహలం  -  ముందు
అమృతం  -  వెనుక
పురిటినొప్పులు - ముందు
అమ్మ తనం - వెనుక
కఠినమైన పరీక్షలు  - ముందు
ఉజ్వల భవిష్యత్తు  - వెనుక
నిరంతర సాధన - ముందు
అనితర సాధ్యం  - వెనుక
జీవన పయనం లో  గల తమాషా ..
కష్టాలన్నీ  - ముందు
ఇష్టం తో కృషి  చేసాక
సుఖాలన్నీ   -  వెనుక
తెలుసు కుంటే...
సరిగ్గా  తేల్చుకుంటే....
మన జీవితం అంతా
'ముందు  - వెనుకా'
🙏🙏🙏🙏🙏



కవిత సంఖ్య :  9

************************
       
       ప్రయాణం
      ------------------


 ఎటువంటి  కొత్తదనాన్ని  అయినా

 తన జీవితం లోనికి స్వాగతించే

మనిషి ...


పృకృతి వైపరీత్యాలకు సైతం

ప్రాణాలను ఎదురొడ్డే

మనిషి ..



విశ్వాంతరాళం లోనికి

అలవోకగా దూసుకెళ్ళే

మనిషి ......


విలాసవంతమైన భవంతులలో

కులాశాగా  కులికే

మనిషి .....


తన  బాహ్య ప్రయాణం లో

అనేక విజయాలు

అలవోకగా సాధించవచ్చు


అంతటి తో  ఆగకుండా


అంతఃప్రయాణం వైపు

దృష్టి పెట్టి


అహంకారం తొలగించి


స్వార్థాన్ని  అణీచేసి


మానవత్వాన్ని  మేల్కొల్పి


ఆధ్యాత్మికను ఆశ్రయించి


తన దివ్య ప్రయాణాన్ని

కొనసాగిస్తే


మనిషి  ఒక మహర్షి గా

మోహత్వం జయించగలడు


దివ్యత్వం సాధించగలడు


దైవత్వం పొందగలడు


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి



అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :  10

************************
       
      ప్రతిసారి  -  మరోసారి
---------------------------------------
 
అందచందాలు అన్న

ప్రతిసారి

వృద్ధాప్యం  నవ్వింది

మరోసారి


కష్ట సుఖాలు అన్న

ప్రతిసారి

విధిరాత నవ్వింది

మరోసారి


కులము గుణము అన్న

ప్రతిసారి

మరుభూమి నవ్వింది

మరోసారి


పోరాట ఫలమేది అన్న

ప్రతిసారి

కృష్ణ గీత నవ్వింది

మరోసారి



నీ సొత్తు  నా సొత్తు అన్న

ప్రతిసారి

విష్ణు మాయ నవ్వింది

మరోసారి



చావు పుట్టుకలు అన్న

ప్రతిసారి

జీవాత్మ నవ్వింది

మరో సారి



పునర్జన్మ వద్దు అన్న

ప్రతిసారి

పరమాత్మ నవ్వింది

మరోసారి


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   11

************************
          పోలిక
      -------------------


 కోడి నిద్ర

కొంగ జపం

నక్క తెలివి

కుక్క చావు

గాడిద చాకిరీ

పంది బరువు

 కోతి చేష్టలూ

కొండముచ్చు నవ్వులూ


చిలక పలుకులూ

గుడ్లగూబ చూపులూ


అని నిరంతరం

పక్షులతో

జంతువులతో

పోల్చి చూసుకునే

ఓ మనిషీ....


నువ్వెప్పుడు

మనిషి లా బ్రతుకుతావు?


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   12

************************  

పాత సంవత్సరం - కొత్త సంవత్సరం
--------------------------------------------------------
   
పాత సంవత్సరం

కొన్ని పాఠాలు చెప్పింది


దురదృష్టం  అంటే ......

ఇష్టం లేని పనిని

జీవితాంతం  చెయ్యాల్సి రావడం  అనీ ..

అదృష్టం అంటే

కృషి  లోనే

విజయాన్ని వెతుక్కోవడం అనీ ..


కొత్త సంవత్సరం

కొన్ని ఆశల్ని  తెచ్చింది


శ్రమ లోనే

సంతృప్తి కి మార్గం ఉన్నదనీ


మది అనే గుడి లోనే

జ్ఞాన దీపమున్నదనీ


అనుభవసారము

కొత్త తీర్పు తెచ్చింది

పనిని  కష్టం గా

తలిచానా

బానిసనవుతాను



పనిని బాధ్యత గా

భావించి నప్పుడే

యజమానిని అవుతాను    అనీ ..





🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   13

************************

     ఆనందభాష్పాలు
 ---------------------------------

ఒక నిశబ్ద నీరవ నిశీది వేళ లో


మనసెందుకో చివుక్కుమన్న క్షణం లో


కాస్త  స్థిమిత పడదామని


కన్నీటిని ఆశ్రయించాలనుకొన్నా..


మనస్సు లోపల అంచు ల వరకూ  వెళ్లి

తడిమి చూసాను


కాస్త తడి చేతికంటింది

ఎందుకు వచ్చి ఓదార్చలేదని

కినుకుగా అడిగాను


ముసిముసి గా నవ్వుతూ

కన్నీరు ఇలా పలికింది ..

" నేస్తమా.. నా ప్రాణమా..

ఆశలను అదుపు చేస్తావు

డబ్బులను పొదుపు చేస్తావు

కుటుంబానికి ప్రాముఖ్యత నిస్తావు


స్నేహితులను ఆదరిస్తావు

ఉద్యోగానికి వన్నె తెస్తావు

ఉద్వేగాన్ని అదుపు చేయాలంటావు

ఇక మా అవసరం

నీకేమైనా ఉందా అని

నిన్ను వదిలిపోయాము"

అని పలికినాయి


అప్పుడు రాలాయి

రెండు  చల్లని అశ్రువులు


మనసు చెదిరితే కురిసిన

కన్నీటి పుష్పాలు కావు లే అవి


మనసు చిలికితే  చిందేసిన


ఆనందభాష్పాలు సుమా!



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   14

************************

రూపాయి చేసే తిరకాసు
--------------------------------------


రూపాయి నీ చేతిలో
రెపరెపలాడితే చాలు

పసిపాప లేతముద్దు
బుగ్గను తాకుతుంది

వాలుచూపు నెరజాణ
కిలకిలా నవ్వుతుంది

మూలనున్న ముసిలోడు
గబగబా వస్తాడు

మొద్దు రాచ్చిప్ప కూడా
పండితుడు అవుతుంటాడు

వీది లోని భిక్షగాడు
వందనాలు చేస్తాడు

ప్రాణం లేని శవమైనా
కదలికలు చూపుతుంది

కురూపి అందాలు
రూపసిగా కనిపిస్తాయి

రాజకీయ చదరంగం
కొత్త మలుపు తిరుగుతుంది


చప్పగా ఉన్న జీవితాన్ని
గొప్పగా మారుస్తుంది

ప్రతిరోజూ  పండుగలా
ఆనందాలను తెస్తుంది

మనిషికి తనపైన తనకి
నమ్మకాన్ని తెస్తుంది

అప్పుడప్పుడు పక్కవారిపై
అనుమానం పెంచుతుంది
దైవదర్శనం కు  సైతం
ముందు వరుసనిస్తుంది

పేరు ప్రఖ్యాతులు కూడా
సంపాదించి పెడుతుంది


కానీ

రూపాయి చేసే తిరకాసు

తెలుసుకొనే  తరుణంలో

దాచిపెట్టి ఉంచామా..
స్వర్గం చూపిస్తుంది

నిర్లక్ష్యంగా మెలిగితే..

నరకాన్నే రప్పిస్తుంది


తస్మాత్ జాగ్రత్త !


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   15

************************
   
దూరాన్ని కలిపిన దారం
-------------------------------------

మేఘసందేశం ..

పావురాల సందేశం..

రాయబారి సందేశం ..

కాలగతిలో

దూరాన్ని కలిపిన దారం

ఉత్తరం....

తమవారి   యోగక్షేమాలు
పదిలంగా చేరవేసే ఉత్తరం

కష్ట సుఖాలను ఆత్మీయులతో
పంచుకొనే ఉత్తరం

స్నెహితుల పరామర్శలతో
చెమ్మగిల్లిన ఉత్తరం ..

ప్రేమికుల విరహాగ్ని తో
విలవిల లాడిన ఉత్తరం ..

సైనికుడి  ఆగమనాన్ని
ఇంటికి చేరవేసే ఉత్తరం ..

కొత్తజంట గుసగుసల తో
కిలకిల లాడిన ఉత్తరం ..


తల్లిదండ్రుల ఆశీర్వాదంతో
పులకించిన ఉత్తరం ..


మారుతున్న కాలం తో
రూపాన్నీ మార్చుకుంది


పాతపెట్టె లలో
దాచుకొని చదువుకున్న
జ్ఞాపకం  లా  మాత్రం మిగిలింది

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   16

************************
     
        ఆదర్శం
     ------------------
సంపదను ఆర్జించే సమయం లో
చీమ నాకు ఆదర్శం

సమస్యను ఎదుర్కొనే సమయం లో
సింహం నాకు ఆదర్శం

ఛీత్కారాలు భరించే సమయం లో
సాలీడు నాకు ఆదర్శం

సుఖాలు అనుభవించే సమయం లో
తామరాకు నాకు ఆదర్శం

సంసారం లో తేలియాడే  సమయం లో
అనంత సాగరం నాకు ఆదర్శం

ఆటుపోటులు ఎదుర్కొనే సమయం లో
తెరచాప నాకు ఆదర్శం

లక్ష్యాలను గురిపెట్టే సమయం లో
అత్యున్నత శిఖరం నాకు ఆదర్శం

దాహం తీర్చుకునే సమయం లో
చకోరపక్షి నాకు ఆదర్శం

బురద నీటిని చూసే సమయం లో
తామరపూలు నాకు ఆదర్శం

వ్యక్తిత్వం వికసించే సమయం లో
ప్రతి జీవీ   నాకు ఆదర్శం

మానవత్వం పరిమళించే సమయం లో
ప్రతి మనిషీ నాకు ఆదర్శం


ఆధ్యాత్మికంగా గుభాళించే సమయం లో

ప్రకృతిలోని అణువణువూనాకుఆద ర్శం

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   17

************************

     అందం - ఆనందం
   -------------------------------
నెమలి పురి విప్పి ఆడినప్పు డే..

కోకిల తనగొంతు సవరించినప్పు డే...

హరివిల్లు నింగిలో విరిసినప్పుడే..

సన్నజాజి సువాసన విరజిమ్మి నప్పుడే ..

చిరుజల్లు సన్నగా జాలువారినప్పుడే..

మట్టివాసన మెల్లగా తాకినప్పుడే..

మదిలోనీరూపం తళుక్కుమన్నప్పుడే..

అందం - ఆనందం

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   18

************************

కాలం తో కబుర్లు
----------------------------
కాలమా...నా నేస్తమా..

ఈ సృష్టి లోని
అత్యంత అద్భుతానివి నీవు
ఏ అమృతాన్ని తాగావో కానీ ..
మరణమన్న మాట లేదు నీకు
నిత్య యవ్వనాన్ని
స్వంతం చేసుకొని
మెరుపుతీగ లా సాగే నీకు
ఎవరూ సాటిరారు సుమా!

నా సంతోష సమయం లో
వేడెక్కిన మంచులా
ఇట్టే కరిగిపోతావు..

నా విషాద గడియలో
యుగమంత సేపుగా
విస్తరిస్తావు..

ఒక్క క్షణం లో
అందలం ఎక్కిస్తావూ

మరో క్షణం లో
పాతాళానికి తొక్కేస్తావూ

ఒక్కోసారి
మంచి స్నేహితుడి వై
సన్మార్గంలో నడిపిస్తావు..

మరోసారి
ప్రధమ శత్రువు లా
ముళ్ళకంచెల్లోకి విసిరేస్తావు..

దయవుంటే
పట్టిందల్లా బంగారం చేస్తావూ..

కోపంవస్తే
బంగారాన్ని మట్టి గా మారుస్తావూ..

నీవు జీవితాంతం
నాతో పాటే ఉంటావూ..

నా గుప్పెట్లో కి మాత్రం రానంటావూ..

ఏది ఏమైనా

నీవు మాత్రం
ఒక గొప్ప మాయల ఫకీరువి..

నేను మాత్రం
నీవు ఆడుకునే
ప్రాణమున్న మట్టి బొమ్మ ను


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   19

************************


         గర్వస్మృతి
         -----------------

అమృతవర్షిణి పాడినప్పుడు
మాస్టరు అమోఘం అన్నారనీ..

గీతాగోవిందం ఒప్పజెప్పినప్పుడు
నాన్నారు అద్భుతం అన్నారనీ..

ఆశువుగా కవిత్వం చెప్పినప్పుడు
స్నేహితులు శభాష్ అన్నారనీ..

వికసించిన నా హృదయ కమలం
సంతోష సౌరభాలు
విరజిమ్ముతుంటే

మా అమ్మ ముందు కెళ్ళి
నిలబడతాను
నేను చెప్పేదంతా
మౌనంగా వినే అమ్మకు
అమృత వర్షిణి తెలియదు
గీతాగోవిందం తెలియదు
ఆశుకవిత్వమూ తెలియదు

కానీ ....
స్పందించిన నా హృదయానికి
ప్రతిస్పందన గా

చిన్న చిరునవ్వు తో
నా నుదుట న
మెత్తని ముద్దిస్తుంది.

ఆ చిరునవ్వు లోని ఆప్యాయత..

నా విజయ సింహాసనానికి
సోపానమవుతుంది.

ఆ చిరుముద్దులోని
ఆర్ర్ట్థత ..

నా మదిలో మెదిలే
" గర్వస్మృతి " అవుతుంది


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   20

************************

సంక్రాంతి ముచ్చట్లు
--------------------------------
పండుగల సంబరాలలో
ఎవరెవరు ఏమంటున్నారో తెలుసా..


ముస్తాబైన పల్లెలు ఏమన్నాయీ అంటే ..
వేడుకలంతా మనకే సొంతం అనీ ..
ఇంటింటి లోగిళ్ళు ఏమన్నాయీ అంటే ..
రంగుల హరివిల్లులు తిలకించమనీ..

భోగిమంటల వెలుగులు ఏమన్నాయీ అంటే
పాత పీడ అంతా ఇక విరగడైయ్యిందీ అనీ ..
మకర సంక్రాంతి ఏమంటున్నదీ అంటే ..
కొత్త బియ్యం పొంగలి రుచి చూడమనీ..
కనుమ పండుగ ఏమంటున్నదీ అంటే ..
పశువుల పరుగుపందాలు వచ్చిచూడండీ అనీ.

పిల్లాజల్లా ఏమంటున్నారూ...
ఆటపాటలతో కాలం గడిచి పోతున్నదీ అనీ.

అవ్వలూ తాతాలూ ఏమంటున్నారూ..
పసిపిల్లల సందడి వారికి అసలైన కానుక అనీ..

ఆడవాళ్ళు ఏమంటున్నారూ..
పిండివంటల విందు ఆరగించమనీ..
మగవాళ్ళు ఏమంటున్నారూ...
ఇంటికి వచ్చిన వారందరినీ ఆదరిస్తామూ అనీ..

పల్లె లోని అణవణువూ ఏమంటున్నదీ అంటే ..
హరిదాసు పాట లూ
గంగిరెద్దుల ఆట లూ
గొబ్బిళ్ళ ముగ్గులూ
మరదళ్ళ సిగ్గులూ

మా పల్లెలకే అందం అనీ ..


 ఇంతకీ ఈ కవయిత్రి ఏమంటున్నదీ..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అనీ..
పండుగలను హాయిగా ఆస్వాదించండీ అనీ..

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   21


************************


నిందా స్తుతి
--------------------
( మనకు చాలా ఇష్టం  అయిన వారిని
 ఒకవైపు  విమర్శిస్తూ
మరొక వైపు వారిపై

అంతులేని అబిమానం
ఒలకించడాన్ని నిందాస్తుతి అంటారు

సహజం గా తమకు ఇష్టం అయిన దేవుడి ని
తండ్రి లా చనువుగా భావించి  నిందాస్తుతి చేస్తూ  ఉంటారు

చలం గా రి పాద పద్మాలకు సహస్ర. వందనాలతో
నా ఈ ప్రయత్నం  అంకితం 🙏🙏  )

చలం గారు
-------------------

జీవించడమే  కానీ...
బ్రతకడం తెలియని
పిచ్చి మారాజు

జాలి  మాత్రమే తెలిసి
జాదూ ఎరుగని
అమాయక జీవి

పసిబిడ్డ మనసు కలిగి

పసిడి ని ద్వేషిం చిన
వెర్రివాడు

అభాగ్యుల ను చేరదీసి
తిరుగుబోతుగా నిందపడ్ద

నీలాపనిందుడు

కక్ష్య కట్టి న వారు

తరిమి  తరిమి  కొడితే

రమణాశ్రమాన్ని చేరిన

తిక్క సన్యాసి

తెలుగు  సాహిత్యాన్ని
తన రచనలతో

సుసంపన్నం  చేసి

నిందలు   మూటగట్టు కున్న

వెర్రి నాగన్నా

నీ  కోసం  ఏం చేసే ది తండ్రీ

నీ  ఆత్మ శాంతికి

దేవుడిని మొక్కుదామంటే

నీ కు  దేవుడంటే నే

నమ్మకం లేకపోయే

కాశీ లో  సంతర్పణ లు
 
చేయిద్దామటే

ఇంతే నా నన్ను

అర్థంచేసుకుంది


అని నవ్వు  తుంటివి


నీ కు మదిలో

గుడి కట్టి  మొ క్కి

నా బిడ్డ కు
నీ  పేరు  పెట్టుకున్నా

ఇంతకన్నా  ఏమీ చేయలేక

గమ్మన్నున్నా


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ

S K NO-175
తిరుపతి
🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   22


************************

రైతు బతుకు
--------------------

మొన్నే మొ

కనుచూపు  వరకూ
కానరాని  వాన చినుకు

నిన్నే మొ

చెరువు గా మారిన
పంటచేలు


తల్లి  పుస్తెలు

ఇంట్లో  తిండి గింజ లు
అయ్యే

భార్య గాజులు

పిల్లల పుస్తకాలు గా
మా రే

పురుగు మందులు

పాయసాలుగా
పొంగే


ఓ రైతన్నా

అప్పుడైనా

ఇప్పుడయినా

నీ  బతుకు

ఇంతేనా


ఎప్పటికైనా

బాగుపడుతుంది
అని  భరోసా

ఎక్కడిది?

ఆదుకునే
ఆపన్న హస్తం
ఎవ్వరిది?

గంజాం. భ్రమరాంబ
Sk-175
తిరుపతి
చిత్తూరు  జిల్లా

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   23

************************

నువ్వెప్పుడు జన్మించావ్
---------------------------------------

నిజం చెప్పు
ను వె ప్పుడు
జన్మించావు?

నీ  తల్లిదండ్రులు
నీ కు ఊపిరి పోసిన
నిమిషం లోనా....

లే దా
నీ  మానవ జన్మ కు
అర్థం, పరమార్థం

వుందని తెలుసు కున్న
మరుక్షణంలో నా ....

రత్నాకరుడు
వాల్మీకి గా,

గౌతముడు
బుద్ధుడు  గా,

నరేంద్రుడు
వివేకానందుడు  గా,

మోహనుడు
మహాత్ముడు  గా,

ఠాగూర్
కవీంద్రుడు గా,


థెరెసా

విశ్వ మాత గా,

పునః  జన్మించడానికి

సంవత్సరాల కాలం
యుగాంతాల త్యాగం
జన్మాంతరాల
మేథో మధనం

వెరసి
వారి జన్మ సాఫల్యం

మరి

ను వె ప్పుడు
జన్మి స్తావు?

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   24

************************

ఖరీదైన బా ల్యం
--------------------------

నా  చిన్నారి బా బు

ఒక్కో
పుట్టిన రోజు  కూ


విలువైన  బహుమతులు ,

ఖరీదైన బంగళాలు,

బంగారు హారాలు,

పట్టు పీతాంబరాలు

పట్టణం  లో ని
అత్యాధునిక
హోటల్  లో
అట్టహాసంగా
డిన్నర్ లు

ఇవ్వడం  అల వా టు
అయిన నే ను

ఈ సారి కూడా
అంతే  గర్వంతో

ఏం కావాలో
చెప్పమన్నాను.

ఈ రోజు అయినా
నా ఫ్రెండ్స్ తో

హాయిగా  ఆడుకోనిస్తావా
అని  జాలిగా
అడుగు తు ంటే

నా తప్పు తెలుసుకున్నా

ఖరీదైన మొయలేని
బాల్యాన్ని

నా బిడ్డ భుజాల పై
వుంచానని

జాగ్రత్తగా చూసుకొనే
నెపంతో
ఆటలకు దూరం
చెసానని

ఇలాగే  వుంటే
వాడి దగ్గిర
డబ్బు, చదువు  తప్ప

ఇంకేమీ  మిగలదని

అందుకే  నిర్ణయించుకున్నా

వాడి  అందమైన బాల్యాన్ని
పదిలంగా అందించాలి
అనీ

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   25

************************


దేవుళ్ళు
---------------

నా జీవితం లో
ప్రతి  అడుగు  లో నూ
నా తల్లిదండ్రులు
చూపిన వాత్సల్యం

నా  అభివృద్ధి కి
వారు  అందిచిన ప్రోత్సాహం

నా చిన్న చిన్న ఇబ్బందులకే
వారు  కలవర పడిన వైనం

నా కోరికలన్నీ  నిజమవ్వాలని

వారు పడిన తాపత్రయం

ఫలితంగా  వారి జీవితం అంతా త్యాగాలమయం

ఎన్ని జన్మ ల కైనా

నువ్వే నా బిడ్డ వి
అన్న అమ్మ మాట

నీ  మొదటి బిడ్డ ను ఎత్తుకొని ఆడించి

నీ  రెండవబిడ్డ గా
బిడ్డ గా పుట్టాలని
వుంది అన్న
నాన్న ప్రేమ

వాళ్లు కేవలం నా ప్రియమైన
 తల్లిదండ్రులు మాత్రమే  కాదు

పూజ్యనీయ
దేవుళ్లు
అన్న వాస్తవాన్ని

తెలిపింది
వాళ్ల ఋణాన్ని ప్రతీజన్మ కూ
పెంచింది

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి


అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   26

************************

చెన్నై  విషాదం
-----------------------
చెన్నై  నగరమా

ఓ శో క సంద్రమా నిన్నటి

దాకా
వుధ్యొగులతో
విద్యార్థులతో

కళ కళ లాడి న నువ్వు

నే డు
వానలతో వరదలతో

కన్నీటి కడలిలా మిగిలావు

ఆకాశ హార్మ్యాలు
బురద కూపాలు అయినాయి

నీ వీధుల్లో
పడవలాంటి కార్లకు
బదులుగా

పడవలే తిరిగాయి

ఒక్క నాలుగు  రోజుల్లోనే

కో టీ శ్వరులు సైతం

మంచి  నీళ్ల కోసం

చేతులు చాపాల్సి వచ్చింది

ప సిపాపలు
ముసలివారు
చివరకు
రోగులు సైతం
నిలువ నీడలేక
విలవిలలాడారు

నీ వు వంట రిగా
సమస్యలను  ఎదుర్కొని
వుండవచ్చు   కానీ

నీ పునర్నిర్మాణం  లో
మే  మంతా నీ తో నే
వున్నాము

నీ కష్టం  చూసి
మనసున్న
ప్రతి  కన్ను
కనీసం  రెండు
కన్నీటి బొట్టు లు కార్చినా

ఇంకో  సునామీ కె రటమ్ లా నిన్ను  ముంచితే

ప్ర మా దమని

ఆగా ము   కానీ
లేక పోతే

మా దుఖాశ్రువులు

నీ కు కాస్తన్నా  వూరటనిచ్చెది

అయినా
దిగులు  పడకు

మే మున్నాము
అంటూ
ప్రతి చెయ్యి,   చెయ్యి
కలిసి  నీకు

సాయం  చేయడానికి
అడుగు  ముందు కు
వేస్తూ  నీకు తప్పక

భరోసా  ఇస్తుంది

ఎందుకంటే
విపత్కర పరిస్థి తు ల
నుంచే గా
మనిషి
మానావత్వం
అనే
గొప్ప సుగుణం

పెంపొందింప చేసుకున్నాడు.


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   27

************************

చెరపాల్సిన హద్దులు
---------------------------------

రాళ్ళను  రాపాడించి
అ గ్గిని పుట్టించడానికి
తడబడిన ఒకనాటి  మనిషి
నే డు రాకెట్ల లో విశ్వాంతరాళానికి
పయనమయ్యాడు.

వేటాడి తెచ్చిన పచ్చి మాంసాన్ని
తినలేక తిన్న మనిషి
నే డు పంచభక్ష్య పరవాన్నాలతో
విందులారగిస్తున్నాడు.

పక్కవాడి మూగసైగలు అర్థం కాక
నానా అవస్థ లు పడిన మనిషి
నే డు సరికొత్త మాద్యమాలతో
మనసు పంచుకుం టున్నాడు.


ఎన్నోరకాలుగా ఎదుటివారి
కన్నీళ్లకు కారణమైన మనిషి
నే డు అవయవదానం తో
మనీషి  గా ముందుకొస్తున్నాడు.

దినదినాభివృద్ధి  చెందుతున్న......
క్రమక్రమంగా వికసిస్తున్న.....

మానవ పరిణామ గమనం లో

పశువాంచలను ప్రక్కన పెట్టి
ఆధ్యాత్మిక భావాల పై దృష్టి పెట్టి

సానుకూల దోరణికి పదునుపెట్టి

మానవత్వ విలువలను ఎక్కుపెట్టి

 తరంతర  నిరంతర కృషి  తో

ప్రతీ  మనిషి
చెరపాల్సిన హద్దులు

ఎన్నో .... ఎన్నెన్నో...

 🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
S K-175
తిరుపతి
🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   28


************************

కలవరం
--------------

ప్రియా....

నేను  రావడం
నిమిషం   ఆలస్యం  అయినా

కాస్త చొరవగా
ఇతరుల తో మాట్లాడినా


క్షణ కాలం నా పెదవి పై

చిరునవ్వు  మాసినా


నీకు కలిగే    అలజడి

'కలవరం '

 ఆ అలజడే
అభిమానం అయితే   అది

'కల-వరం  '

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   29


************************

ను లి వెచ్చని    నీ జ్ఞాపకం
-------------------------------------

నీలిమబ్బుల నీడలూ

పచ్చని చెట్ల దాపులూ

తెల్లని   పూల జల్లులూ

చల్లని   వెన్నెల నురగలూ

ఇవన్నీ  ఉంటే....

పక్కన నువ్వుంటే చాలు


ఇవేవీ  లేకుంటే....


ను లి వెచ్చని    నీ జ్ఞాపకం చాలు

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   30

************************
కన్నీటి గంతలు
-------------------------

మూసివున్న మది తలుపును

జ్ఞాప కాల  మునివేళ్ల తో

అలవోకగా  నెట్టగానే

నీ  రూపం  కనిపించి

క్షణం  లో  అస్పష్టం అయ్యింది

బహుశా  నా కళ్ళకు

ఆనందం  అల్లరి తో

కన్నీటి గంతలు కట్టినట్లుంది


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   31

************************
 
         ప్రక్షాళన
        ---------------
ప్రభూ.....

పగలంతా
పంతాలూ
పట్టింపులతో

కలుషితమైన
నా హృదయమందిరాన్ని

రాత్రి వేళ
నీ జ్ఞాపకం తెచ్చే కన్నీటితో

ప్రక్షాళన చేసుకుంటాను.



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   32

************************

     రెండు అవకాశాలు
   ------------------------------

నేను ఓడినప్పుడల్లా

నాకు రెండు అవకాశాలు ఉన్నాయి

మొదటి ది
అంతులేని వేదనతో
ఓటమి కి తలవంచడం

రెండవది
రెట్టించిన పట్టుదలతో
మళ్లీ మళ్ళీ ప్రయత్నించడం

నేను గెలిచినప్పుడల్లా.

నాకు రెండు అవకాశాలు ఉన్నాయి

మొదటి ది
నాకు మాత్రమే సాధ్యం అన్న    
 అహంకారంతోవిర్రవీ గడం

రెండవది
భగవంతునికి సమర్పించి
నిరంతరం శ్రమించడం

నేను విమర్శించ బడినప్పుడల్లా

నాకు రెండు అవకాశాలు ఉన్నాయి

మొదటిది
ఎదుటివారి పై విపరీతంగా
అక్కసు ను ప్రదర్శించడం

రెండవది
వారి విమర్శ లోని
మంచిని మాత్రమే స్వీకరించడం


నేను పొగడ్తల వర్షంలో  తడిసినప్పుడల్లా

నాకు రెండు అవకాశాలు ఉన్నాయి

మొదటిది
ఆ వర్షం లో నే ఆగి తడవడమూ

రెండవది
పొగడ్త ను పన్నీరుగా స్వీకరించి
మరింత కృషి చూపడం


కాబట్టి ...

నేను
మొదటి అవకాశం
ఎంత ఎక్కువగా వద్దనుకుంటే

నాకు
రెండవ అవకాశం
అంత  పరిపక్వతను  తెస్తుంది  


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   33

************************
గడసరి అత్తా - సొగసరి కోడలు
---------------------------------------------------

కోడలా

సంవ త్సరమంతా మొగుడిని సాధించినా పరవాలేదు ..

పండుగ రోజు కాళ్ళకుమొక్కు....
చేసిన తప్పులు మొక్కు లతో సరీ...

అంది గడసరి అత్త......

సరే అత్తమ్మా....


మీరింత అనుభవంతో చెపుతుంటే
ఎలా కాదనగలనూ  ...

 అంది
సొగసరి కోడలు

తల తడుముకుంది
మర్మమెరిగిన
మామ గారి చేయి....


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   34

************************

           ఆరాధన
        -------------------
భీమ్లీ సముద్ర తీరంలో
 బాలభానుడు
ఎగిసిపడే కెరటాలతో
ఆటలాడుకునే వేళ

ఆమె అందమైన ముఖం
మొదటి సారిగా
అలల పరదాల చాటున
అస్పష్టంగా  కనిపించింది

తుషార బిందువులలో
చల్లని పైరగాలిలో
మబ్బుల మాటున
చిగురుటాకుల వెనుకనా

తరచుగా ఆమె నాకు తారసిల్లింది...

ఆమెను కలుసుకోవాలనీ
ఆమె ఎవరో తెలుసుకోవాలనీ
నా హృదయం
చాలా తొందర పెట్టింది

అందం ఎక్కడో ఆమె అక్కడ
విషాదం ఎక్కడో  ఆమె అక్కడ
ఆవేశం ఎక్కడో ఆమె అక్కడ
ప్రశాంతత ఎక్కడో ఆమె అక్కడ

ఎన్నో ప్రదేశాలలో
చాలా రూపాలలో  కనిపించింది

పలుకరిస్తే పలుకదు
వెంటాడితే మాయమవుతుంది

ఆమె పట్ల నాకున్న
" ఆరాధన " తెలపాలనీ
కనీసం ఆమెకి ఒక లేఖ అయినా
వ్రాయాలని కలం పట్టగానే

అక్షరరూపం లో ప్రత్యక్షమైన
ఆ కవితాకన్య చిరునవ్వు నవ్వింది

కొసమెరుపులాంటి
ఆ చిరునవ్వు తెలిపింది

నా మదిలోనే  ఆమె నివాసమనీ..
ఆమె ఇంకెవరో కాదూ
నా హృదయ ప్రతిస్పందన అనీ ...


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   35

************************

     
          జీవన రవళి
        ----------------------

ఆనందం ఒకానొక నిమిషం లో
మదిలో నెమలి పింఛం లా
పురివిప్పి  నర్తిస్తుంటే..

నాదస్వర విన్యాసానికి
శిరసూపుతున్న నాగిని లా
మనసు పరవశిస్తుంటే...

మంచుకురిసే వేళ లో తాకిన
గోరువెచ్చని ఎండలా...

మండుటెండలో  వీచిన
మల్లెల చిరుగాలిలా..


నీ మధురమైన జ్ఞాపకం
నన్ను మెల్లగా స్పృశిస్తుంది


నీ మాటల తియ్యదనం
ఏ తేనెలలో పొందనూ?
నీ కౌగిలి వెచ్చదనం
ఏ నీరెండ లో వెతకనూ?

ఈ ప్రపంచం ఇచ్చిన
అపురూప కానుక నీవు...

నా ప్రపంచాన్నే మార్చేసిన
అద్భుత సృష్టి  నీవు...


నీ అందం,హోదా, ఐశ్వర్యం ..
ఇవేవీ కావు..

నీ మాట, నేర్పు,ఓర్పూ ...
ఇవి కావూ...

నా మధుర మురళి కి
నాదం - అనునాదం తెలిపింది ...

నా " జీవన రవళి  " కి
రాగం - అనురాగం నేర్పింది ...


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   36

************************
     ఇలలో వెలసిన స్వర్గం
  ----------------------------------------

నా ఆరేళ్ళ పసిప్రాయం లో
అల్లరి శృతిమించుతున్న వేళలో ...
అమ్మ పరిచయం చేసింది
 పుస్తక ప్రపంచాన్ని తొలిసారిగా ..

నా తొలకరి  బాల్యాన్ని,
నా చిన్నారి ఆలోచన లనూ
చందమామ, బాలమిత్ర కథలు ప్రభావితం చేసాయి.

నా యవ్వనాన్ని పలకరించిన
మంచి సాహిత్యం
నా జీవన పదగతికి
చక్కటి   దిశానిర్ధేశం  చేసింది

సంసార సాగరంలోమునిగి తేలడానికి
అవసరమైన ఓర్పు నేర్పు
పుస్తకాలే అందించాయి.

నడివయస్సులో
ఒంటరితనం  కొండచిలువ లా
నెమ్మదిగా మనస్సులో కి
ప్రవేశిస్తున్న వేళ
పుస్తకప్రపంచమే నాకు
చక్కటి ఆశ్రయమిచ్చింది

వృద్ధాప్యం లో ..రెండవ బాల్యంలో
నా ఉనికిని నేనే   వెదుక్కునే వేళలో
భవబంధాలు క్రమంగా
దూరమయ్యే తరుణంలో
భక్తిరసం  తద్వారా
బంధనాల విముక్తి  రసం
అక్కడే లభించింది

నా జీవితాన్ని మళ్ళీ ఒకసారి
తిరగేసి చూస్తే ..
బాల్యం నుండి వృద్ధాప్యం వరకూ

నన్ను వీడని నేస్తాలు నా పుస్తకాలు

నా బాధల్ని పంచుకొని
సమస్యల పరిష్కారాలు  తెలిపి
ఊహల ఊయలలు ఊపి
నాలోని సాహితీ తృష్ణ ను పెంచి

ఎన్నో మస్తిష్కాలను ఆవిష్కరించి
మరెన్నో అనుభవపాఠాలను నేర్పించి
నా వ్యకిత్వం వజ్రంలా మెరిసేలా
నా ఔనత్యం శిల్పంలా మలిచేలా

నా జీవితమంతా విస్తరించిన
పుస్తకప్రపంచం

నాకు ....
" ఇలలో   వెలసిన స్వర్గం "


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   37

తేదీ : 20-01-2016

************************

       
         అంతర్వాహిని
     --------------------------------

ప్రభూ.....


ఊపిరాడని పనిలో....
ఏమీ తోచని విశ్రాంతి లో ..
అలుపెరుగని ఆలోచన లో ...
కుదురైన ధ్యానముద్రలో...
మెలకువగా ఉన్నప్పుడూ ..
నిద్రాదేవి ని ఆశ్రయించి నప్పుడు....


 నా..హృదయస్పందన లా..

నా..ఉచ్ఛ్వాస నిశ్వాసాల లా..

నా..ప్రాణ సంవేదనలా...


నిరంతర ...  నీ...నామస్మరణ ...

  నాలో ప్రవహించే ...
  " అంతర్వాహిని"


నన్ను నడిపిస్తుంది ..
నన్ను పలికిస్తుంది...
జ్ఞాన దీపం వెలిగిస్తుంది
అజ్ఞాన తిమిరం తొలగిస్తుంది


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   38

************************

        కవితల మధుమాసం
     ----------------------------------

నా కవితలు ...

అవి తెలిపే ..ఊసులు..

పారాడే పసిపాపల నవ్వులు ...
తలవూచే లేతచిగురు కొమ్మలు ...

ప్రతిరోజూ పలుకరించే చల్లని పవనవీచికలు...

పరిమళాలు వెదజల్లే
సన్నజాజి పూవులు ..

అలుపుసొలుపులేని
సాగర కెరటాలు...

క్షణమైనా మరువలేని
మధురస్వప్నాలు..

ఎదుటివారి బాధను చూసి
రాల్చిన దుఃఖాశ్రువులు

అన్యాయపు నిర్ణయాలను
ఎదురించిన ఉక్కుపిడికిళ్ళు

తొలిపొద్దువేళలో కురిసే
ప్రత్యూష  హిమ ముత్యా లు

వేడెక్కిన గుండె కు పూసే
మలయమారుత లేపనాలు

ఎప్పుడప్పుడా..అని  ఎదురుచూసే..
వసంతకాల ఆగమనాలు...

వెన్నెలాంటి మనసులో
కురిసే అమృతధారలు

చల్లనైన మమతతో
ఊరుతున్న తేనె ఊటలు

భగవంతుని పాదాలను
సేవించే నవ పారిజాతాలు

వేదాంతపు పోకడలకు
దారిచూపే దీపాల వరుసలు

తెలుగు తల్లి ....దీవెనలకు
శిరస్సు వంచి..ప్రణమిల్లుతూ

నన్ను అభిమానించే వారికై తెచ్చిన ..
వెలలేని ....విలువైన ..
వెన్నెల జలపాతాలు

అందుకే ...

మీ...ముందుకే
మీ..తో ..విందుకే...
పొగడ్తల...పొందుకే.....

వస్తున్నది .....నా....

" కవితల మధుమాసం "


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   39

************************
              విరహం
          ------------------


చిగురించి న ఆశలను
నిర్దాక్షిణ్యంగా తొక్కుతూ

వికసించిన కోరికలను
అపార్థం తో నలుపు తూ

సాగుతున్న నీ గమనాన్ని
క్షణమైనా ఆపకు

వెనుదిరిగీ చూడకు

ఎందుకంటే

నీకోసం విరబూసిన నవ్వులన్నీ వాడాయి

నీ జ్ఞాపకాల నిష్క్రమణ కు
క న్నీ ళ్ళనే వాడాయి



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   40

తేదీ : 22-01-2016

************************

   అమృతం
---------------------

వేగలేని...ఒంటరి తనంలో
స్నేహ హస్తం ...అమృతం

భరించలేని...బాధ లో
ఓదార్పు ...అమృతం

అలమటించే ...ఆకలి లో
పట్టెడన్నం ...అమృతం

జ్ఞాన...సమపార్జన లో
చదువు ...అమృతం

లక్ష్య...సాధనలో
గురుదీవెన...అమృతం

జీవన... పోరాటం లో
దైవబలం ...అమృతం

కవితా...సాగరమధనంలో
సద్విమర్శ...అమృతం

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   41

తేదీ : 22-01-2016

************************
    విసిరేసిన నీతులు
  --------------------------------


అల్లుడు తాగుబోతు అయితే....
కూతుర్ని ...ఓదార్చే....ఒక మహిళ
కొడుకు ...తాగొస్తే..మటుకు..
కోడలే ...కారణం ..అంటుంది

దేశం లోని అవినీతిని
తరిమి తరిమి కొడదాం..అనే ఒకనేత
ఎన్నికలలో ..ఎన్నో..కలలతో
సారాయి, డబ్బును ఎరవేస్తాడు

కుటుంబ బాంధవ్యాలు..ఎంత గొప్పవో
కధగా...రాస్తున్న ఒక రచయిత
మధ్యలో ..పలుకరించిదని
భార్య పై విరుచుకుపడతాడు

లేతమనసుల వేదనలను
హృద్యంగా తెలిపే ..ఒక..కవయిత్రి
కొత్త బొమ్మ పగులగొట్టిందనే..నెపంతో
పనిపిల్ల వీపు ..పగులకొడుతుంది

 ప్రేమ వ్యవహారాలు ...అతి మధురంగా
తెరపై చూపే ఒక దర్శకుడు
కూతురు ప్రేమపెళ్లిని
ఊహమాత్రమైనా..ఒప్పుకోడు


వీరు...

వారు...

విసిరేసిన నీతులు .....

నవ్వుతూ ...అడిగాయి...

చెప్పే వారే .. వీళ్లు...అందరూ

మరి...

పాటించువారు ఎందరూ..?




🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   42

తేదీ : 22-01-2016

************************
     ఆ...నలుగురు
-----------------------------------

పసితనపు కేరింత లలో...
పరువాల తుళ్ళింతలలో...
వివాహ వేడుకలలో ..
కుటుంబ బాధ్యత లలో ...
ఉద్యోగ నిర్వహణ లో ...

కష్ట సుఖాలు ..

సాధక బాధలు ....

గెలుపు ఓటములు...

అన్నీ...ఆ..నలుగురి..తో నే

సమయం ...తో
ప్రాంతం ....తో
సందర్భం...తో

ఆ....నలుగురు ...
వేరు వేరు ....వ్యక్తులు ..అవుతున్నా...

వారు..లేనిదే ...

నా...వసంతాలన్నీ
గ్రీష్మ మములే

నా...ఉషస్సులన్నీ
నిశీధులే..

నా..బృందావనాలన్నీ
ఎడారులే....


అందుకే ..

ఆ...నలుగురూ..
కదలాడే ...దేవుని ...వరాలు



🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   43

తేదీ : 23-01-2016

************************
          కొత్త కవిత
       --------------------


పలుకలేని...మధురమైన  భావన
మదిలో   మెదలాడిన వేళ

కొత్త కవిత....రూపుదిద్దుకొన్నది

పులకింతల....గిలిగింతలు
బిడియం తో ..బయట పడలేని వేళ

కొత్త కవిత...రూపుదిద్దుకొన్నది


అందమైన....స్వప్నాలు
నిద్రలో మేల్కొన్న వేళ

కొత్త కవిత .....రూపుదిద్దుకొన్నది

యదార్థ పెనుకంపనాలు
మొద్దు నిద్రను..కరిగించే వేళ

కొత్తకవిత ..రూపుదిద్దుకొన్నది


సోమరితనం లోని సౌఖ్యం  కన్నా
శ్రమలోని...ఆనందం తెలిసిన వేళ

కొత్తకవిత ..రూపుదిద్దుకొన్నది

ఆశయాలకు ..ఆచరణకు
మధ్య గల దూరం కరిగే వేళ

కొత్తకవిత ..రూపుదిద్దుకొన్నది

నిరంతరం శ్రమతో ప్రయత్నిస్తే
విజయం చేసే సలాంను చూసిన వెళ

కొత్తకవిత ..రూపుదిద్దుకొన్నది

భగవంతుని చల్లని దీవెనలు
మెండుగా  దొరుకుతున్న వేళ

కొత్తకవిత ..రూపుదిద్దుకొన్నది

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స. క.సంఖ్య : 175
తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   44

తేదీ : 23-01-2016

************************
           తెలివి
        ---------------

ఇంత తెలివైన దానివి..

ఎక్కడో ఉండాల్సిన దానివి...

అనేలా.....స్నేహితులు చూసినప్పుడల్లా

చిన్నగా....నవ్వి ..


నన్ను దేవతగా...కొలిచే
మనసులను...వదిలేసి

నా మాట వేదవాక్కుగా
భావించే ...బిడ్డలను..పక్కకి తోసేసి

ఉన్నంతలోనే ...గౌరవం గా
చేస్తున్న...ఉద్యోగం ...విడిచిపెట్టి ..

ప్రస్తుత బాధ్యతలు విస్మరించి ...

కేవలం ఒక...చిన్న ...గుర్తింపు కోసం

సుదూర ...తీరాలకూ..

విదేశీ ....ఉద్యోగాలకూ..

దూరం నుంచి ఆకర్షణ గా...
కనబడే ...సినీ రంగాలకూ...

ప్లాస్టిక్ ..నవ్వుల..మధ్య కి

మర..మనసుల..మధ్య కి...

కొరడాలతో కొట్టకుండా
డబ్బులు మొహాన్న కొట్టి

పనిచేయించే ఆ  మనుష్యుల ..మధ్య కి


మేకవన్నె..పులుల..మధ్య కి

తేనెపూసిన....కత్తుల...మధ్య కి...

పరిగెత్తి పాలు త్రాగడం.
దేవుడి కెరుక ...
నిలబడి నీళ్లు త్రాగితే ...
చాలు...అనిపించే...చోటుకు

నిత్య భగవన్నామ స్మరణ విడిచి ...
ఎందుకొచ్చిన ఖర్మరా...అనే చోటు కు


అవసరం ఉన్నంతవరకే...
వందనాలు ...పెట్టి...

కాస్త ..వెనకబడితే...ముఖం ...
చాటేసే..ఆ..జనాల..మధ్యకి..

రేపటి ...పైన...నమ్మకం..లేని

హడావిడి..మాత్రమేఉన్న..చోటు కు.

ముఖ్యంగా ...
నన్ను...ఒక..మనిషి గా..కాకుండా

బాగా..పనిచేసే ...యంత్రం లా...
తయారు చేసే చోటు కు...

వెళ్లమంటారా....

అనేలా....చూస్తాను...

నా...స్నేహితులు...

నా కన్నా తెలివైన వారు...

నా..మాటల లోని నిజాన్ని...

వారి...అనుభవంతో సరిచూసి కొని

లోకంతీరు..నెమరువేసుకుంటూ

చెమ్మగిల్లిన కళ్లతో

అంగీకారం గా..

నా..భుజం తట్టి..తలలూపుతారు


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   45

తేదీ : 24-01-2016

************************


   మధ్య తరగతి వింతలు
---------------------------------------

వంటలో ఉప్పు కారం
సమతూకం లో ఉండి...
ఇల్లు ..అంటే స్వర్గానికి
పర్యాయ పదం లా..అనిపిస్తే
అది ..  జీతం ...వచ్చిన ...
గోల్డెన్...వారం ...

ఇంటి అద్దె నుంచి..
కరెంటు బిల్లు వరకూ..
నయాపైసలతో..పాటు
చెల్లించ గలిగితే ....
అది...మజా..గా...ఉండే
సిల్వర్ ...వారం ...

ఆదాయానికీ మించిన
ఖర్చులు ..కనబడుతూ
అడిగిన ...ఆరోసారి..
కాఫీ కప్పు ...చేతికి అందితే
అది...యుద్ధం ..ప్రారంభం అయ్యే ..
కాపర్....వారం


ఇల్లంటే...నరకప్రాయంగా..
సంసార మంటేనే...విరక్తి ..గా..
కాఫీ ..అడగాలంటే నే భయపడితే
పలాయన వాదాన్ని వెతుకు తుంటే
అది...జీతం..ఉంటేనే   జీవితం ..అనే
పాపర్....వారం.


మధ్యతరగతి జీవితంలో
ఎన్ని ...వారాలో...
అవి...ఎలా ..మారాలో ...

"మధ్యతరగతి ...వింతలు"
ఎన్నో ...ఎన్నెన్నో...

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   46

తేదీ : 25-01-2016

************************
          గుర్తింపు
       ------------------
మంచిపనులు చేసే వారికి
గొప్పలు చెప్పుకునే..
అవసరం లేదు

గొప్పలు..చెప్పే వారికి
మంచిపనులు ...చేసే
సమయం ...దొరకడం లేదు...

కానీ ...గుర్తింపు ...మాత్రం

మొదట ...తియ్యని ..మాటలకూ....

ఎప్పుడో ....చివరన...
గొప్పపనులకు......

అందుకే
కవితా ప్రపంచం తరుపున..


సమాజ...శ్రేయస్సుకు

నిజంగా ...పనిచేసే వారందరికీ

శిరస్సు వంచి...అభివందనం


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   47

తేదీ : 25-01-2016

************************

        ఇంద్రధనుస్సు
      --------------------------

నేస్తమా.....

ఎన్నిరోజులు అలా ...
విషాద...లోకాలలో ...
విహరిస్తావు....

నీ..కన్నీటితో ...
నా...చిరునవ్వు ...
స్నేహం ...చెయ్యడం ..ఎలా...

ఇలా...చూడు....
ఆనందం ...ఆహ్వానిస్తోంది

అపనమ్మకాలను...
భాధలను...
నీ...విసుగు...అంతా...
అక్కడే ...వదిలేసి ...రా

నువ్వు...వచ్చే దారిలో ..

ప్రేమ ...
అభిమానం..
మమకారం ...
ఓదార్పు ...
నమ్మకం ...
సహకారం ....
సమన్వయం ...

అనే...ఏడురంగులతో...
వేసిన ..నిచ్చెన ...కనిపిస్తోంది ...కదా ...

అది...నీకోసమే...నేనల్లిన

" ఇంద్రధనుస్సు "

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   48

తేదీ : 25-01-2016

************************
       
          ఎందుకిలా
      -------------------------

విహారయాత్ర లకు
వేలకువేలు ఖర్చుపెట్టే....
యజమాని ఔదార్యం ...

వీళ్ళ సామాను..మోసే
కూలి కీ ఐదు రూపాయలు
ఎక్కువ..ఇవ్వాలంటే ...మటుకు
తెగ...గింజుకుంటుంది

    "ఎందుకిలా ...? "

రోజుకు లక్షల లాభం వచ్చే ...
అధునాతన ...షాపింగ్ మాల్స్ లో
వాళ్ళు చెప్పిన...బిల్లులు
నోరెత్తకుండా ...
అణాపైసలతో..చెల్లించే
ఒక...మంచిమనసు

కూరగాయల బండి వాడితో
అరగంట బేరమాడి
సరసమైన ధరలకే ...
కొనడానికి ఇష్ట పడుతుంది

        "ఎందుకిలా ...?"

తోటి...వ్యాపారుల..మెప్పుకోసం
ఫైవ్..స్టార్...హోటల్ లో
అరలక్షరూపాయలు...
అలవోకగా ...ఖర్చు చేసే
ఒక...ఆపన్నహస్తం...

గంటలతరబడి ...
సరఫరా చేసిన...సర్వర్ కు
ఒక వంద టిప్పు...ఇవడానికి
తెగ....ఇబ్బంది పడుతుంది

    "ఎందుకిలా....?"

జాగ్రత్తగా ...గమనిస్తే ...
ఇలాంటి ...ఎందుకిలా ..లు
చాలా ...చాలా ...ఉంటున్నాయి ...

   " ఎందుకిలా ...?"




🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి

అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   49

తేదీ : 25-01-2016

************************

     మహిళా  ఉద్యోగి
-------------------------------------

కోడికూతకు...ముందే నిదుర లేచి..
గడియారం లో ..సెకన్ల ముల్లు లా....
ఇంటిపని ...వంట పని...కోసం
చకచకా ..నలువైపులా..తిరుగుతూ..

పిల్లలు ...వారి...క్యారియర్ లు..
సద్దడం...లో ...కాస్త అయినా
సహాయం వస్తుంది ...అని

ఒక...పెద్ద...చేతికోసం...
కాసేపు  ..ఎదురుచూసి
గురక..రాగం ...రాగయుక్తంగా
వినపడితే....
పోన్లే ...పాపం అని...క్షమించి ..

అందరూ...వెళ్లి పోయాక...
కాస్తన్నా...తినే...వ్యవధి ..లేని.
మహిళా ఉద్యోగి..

నడవడం ...మరిచిపోయి
పరుగు పరుగున ...వెళ్ళి

వృత్తి కి...న్యాయం చేసే ...క్రమంలో
క్రొవ్వొత్తి...లా కరుగుతున్న
ఆరోగ్యాన్ని ...పక్కన పెట్టి

నలుగురు ఎక్కాల్సిన
ఆటో..లో ...పదిమంది ని
ఎక్కించినా...ఓర్చుకొని
అక్కడక్కడ ..ఎదురయ్యే
వికృత..చేష్టలు ...చూసి చూడక
అక్కడికక్కడే ...మరచిపోయి

అప్పుడప్పుడు ..వినబడే
ద్వందార్థపు...మాటలు..
స్పష్టంగా ...విన్నా...విననట్లు
అప్పటికప్పుడే ..వదిలేసి..

ముంచుకొచ్చిన దుఃఖం
ఇంటికొచ్చి ...చెప్పుదామనుకుంటే

నీవెంతమటుకు..చనువిచ్చావో...
అని...శల్యపరీక్ష..చేసే...
ఎర్రని...చూపులు..గుర్తొచ్చి
రేపు..స్నేహితురాలికి..చెప్పుకుందాం
అని...బాధను కూడా...వాయిదావేసి...

పొద్దుణ్ణించి చేసిన సేవలో ..
కనీసం  ...చిన్న...పొగడ్త న్నా...
దొరుకుతుందేమో ...అని..వెతికి ..

లోపాలు ...సుదీర్ఘమైన
విమర్శలు ...మాత్రమే ..దొరికి..

కలుక్కు..మన్న...మనసు

రెండు ..నీటిబొట్లు ..కార్చినా..

మళ్లీ మొదలు పెడుతుంది
అంతే లేని  సమస్యల తో..రణం

కేవలం ...సానుభూతి ..మాత్రమే
ఆశించే ...ఆ...అల్పజీవి ..

తనకోసం ..పదిరూపాయలు
స్వేచ్ఛగా ...ఖర్చు పెట్టలేని
సంపాదించే...కడు..పేదరాలు


నడుము వాల్చడానికి
అరగంట ..కేటాయించ లేని
మరజీవితపు..అనవాలు

 ఆధునిక   జీవిత చదరంగం లో
ఎటుపోవాలో..ఎలావేగాలో..
పాలుపోక ...వీలుకాక...
సతమతమౌతున్న...


"  మహిళా ఉద్యోగి ..."

ఎపుడైనా ...
ఎప్పుడూ ...అయినా..
ఎదురయితే...
మీ...ఇంట్లో ...కూడా...ఉంటే ...
నా...తరపున ..తెలపండి ..
శత కోటి....పాదాభివందనాలు

ఆమెకే ...ఈ..కవితాశ్రువులు
ఎప్పటికీ ...అంకితాలు

🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి


అయుత కవితా యజ్ఞం
------------------------------------
పేరు  : గంజాం. భ్రమరాంబ

ఊరు : తిరుపతి

స.క.సంఖ్య : 175

కవిత సంఖ్య :   50

తేదీ : 25-01-2016

************************
            దురదృష్టం
      ----------------------------

ఒక..అమాయక జీవి...

పొరపాటు గానో..
అతని..గ్రహపాటుగానో..

సుస్వరాలలో...పెట్టిన


ఒక....కాపీ ...కవిత

నిమిషాల లో

పట్టుబడి ..ఉరితీయబడ్డది...

ఎందరెందరో ...

తన్మయత్వంలో తో రాసిన

స్వచ్ఛమైన ..కవితలు


పని...హడావిడి లో

పక్కకి ....విసిరివేయబడ్డ వి


అయ్యో ...  పాపం ..

"దురదృష్టం ..."

ఎవరిదీ?

కవులదా...


పాఠకులదా...


🙏🙏🙏🙏🙏

గంజాం. భ్రమరాంబ
స.క.సంఖ్య : 175

తిరుపతి